ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రూ.6 వేల కోట్ల రికవరీ లక్ష్యం

ABN, Publish Date - Nov 04 , 2024 | 05:57 AM

వర్తమాన ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో రూ.6,000 కోట్ల మొండి బకాయిల వసూలు తమ లక్ష్యమని కెనరా బ్యాంక్‌ ఎండీ, సీఈఓ సత్యనారాయణ రాజు తెలిపారు. మూడు, నాలుగు త్రైమాసికాల్లో ఇంచుమించుగా...

కెనరా బ్యాంక్‌ సీఈఓ సత్యనారాయణ రాజు

న్యూఢిల్లీ: వర్తమాన ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో రూ.6,000 కోట్ల మొండి బకాయిల వసూలు తమ లక్ష్యమని కెనరా బ్యాంక్‌ ఎండీ, సీఈఓ సత్యనారాయణ రాజు తెలిపారు. మూడు, నాలుగు త్రైమాసికాల్లో ఇంచుమించుగా సమానంగా రూ.3,000 వంతున వసూలు చేయగలమని భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. మాఫీ చేసిన బాకీల రికవరీ సహా మొత్తం రూ.2,905 కోట్లు క్యు2లో వసూలు చేయగలిగామని ఆయన వెల్లడించారు. రికవరీలతో పోల్చితే ఎన్‌పీఏలుగా మారేందుకు అవకాశం ఉన్న రుణాల పరిమా ణం తక్కువగానే ఉన్నట్టు చెప్పారు. కెనరా రొబెకో అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ పబ్లిక్‌ ఇష్యూ నాలుగో త్రైమాసికంలో ఉండవచ్చునని ఆయన తెలిపారు. త్వరలోనే దీనికి ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి లభిస్తుందని భావిస్తున్నామన్నారు. బీమా విభాగంలో 51 శాతం వాటాలున్న కెనరాబ్యాంక్‌ ఈ ఇష్యూ ద్వారా 13 శాతం వాటా విక్రయించాలని భావిస్తోంది.

Updated Date - Nov 04 , 2024 | 05:57 AM