మూడు రోజుల నష్టాలకు బ్రేక్
ABN, Publish Date - Dec 12 , 2024 | 06:05 AM
స్టాక్ మార్కెట్‌లో మూడు రోజుల వరుస నష్టాలకు బుధవారం బ్రేక్ పడింది. సెన్సెక్స్ 16.09 పాయింట్ల లాభంతో 81,526.14 వద్ద ముగియగా నిఫ్టీ 31.75 పాయింట్ల లాభంతో 24,641.80 వద్ద ముగిసింది.
ముంబై: స్టాక్ మార్కెట్‌లో మూడు రోజుల వరుస నష్టాలకు బుధవారం బ్రేక్ పడింది. సెన్సెక్స్ 16.09 పాయింట్ల లాభంతో 81,526.14 వద్ద ముగియగా నిఫ్టీ 31.75 పాయింట్ల లాభంతో 24,641.80 వద్ద ముగిసింది. బీఎ్‌సఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ బుధవారం ఒక్క రోజే రూ.91,110.2 కోట్లు పెరిగి రూ.460.46 లక్షల కోట్లకు చేరింది. బుధవారం రాత్రి వెలువడే అమెరికా రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాల కోసం భారత మార్కెట్ ఆసక్తితో ఎదురు చూస్తోందని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చి విభాగం హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.
ఐపీఓల సబ్‌స్ర్కిప్షన్ అదుర్స్ : బుధవారం ప్రారంభమైన మూడు ఐపీఓలకు మదుపరుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. వన్ మొబిక్విక్ సిస్టమ్స్ ఐపీఓ అయితే ఇష్యూ ప్రారంభమైన తొలి రోజు తొలి గంటలోనే పూర్తిగా సబ్‌స్ర్కైబ్ అయింది. రిటైల్ పోర్షన్ ఏడు రెట్లు, నాన్-ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల పోర్షన్ 1.5 రెట్లు సబ్‌స్ర్కైబ్ అయ్యాయి.
విశాల్ మెగా మార్ట్ ఇష్యూ తొలి రోజు ముగిసే సమయానికి 51 శాతం సబ్‌స్ర్కిప్షన్ సాధించింది. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగంలో 53 శాతం సబ్‌స్ర్కిప్షన్ నమోదయింది.
సాయి లైఫ్ సైన్సెస్ ఇష్యూ కూడా తొలి రోజు ముగిసే సమయానికి 84 శాతం సబ్‌స్ర్కిప్షన్ సాధించింది. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగంలో 18 శాతం సబ్‌స్ర్కిప్షన్ వచ్చింది.
Updated Date - Dec 12 , 2024 | 06:05 AM