ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వడ్డీ వసూళ్లలో అడ్డదారులొద్దు

ABN, Publish Date - Apr 30 , 2024 | 06:25 AM

వడ్డీల విషయంలో అనుచిత ధోరణులకు పాల్పడవద్దని బ్యాంకులు, ఆర్థిక సంస్థలను భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ఆదేశించింది. ఒకవేళ ఇంతకు ముం దే ఇలాంటి అనుచిత చర్యలకు పాల్పడి ఉంటే...

బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఆర్‌బీఐ ఆదేశం

ముంబై: వడ్డీల విషయంలో అనుచిత ధోరణులకు పాల్పడవద్దని బ్యాంకులు, ఆర్థిక సంస్థలను భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ఆదేశించింది. ఒకవేళ ఇంతకు ముం దే ఇలాంటి అనుచిత చర్యలకు పాల్పడి ఉంటే తగు దిద్దుబాటు చర్యలు చేపట్టి కస్టమర్ల నుంచి అదనంగా వసూలు చేసిన చార్జీలను వాపసు చేయాలని కోరింది. 2003 నుంచి నియంత్రిత సంస్థలకు (ఆర్‌ఈ) ఆర్‌బీఐ ఫెయిర్‌ ప్రాక్టీసెస్‌ కోడ్‌ కింద మార్గదర్శకాలు అందిస్తోంది. రుణచార్జీల విషయంలో వాటికి అవసరమైనంత స్వేచ్ఛ ఇస్తూనే వడ్డీ వసూళ్లపై స్పష్టత, పారదర్శకతలను ఈ కోడ్‌ ప్రోత్సహిస్తుంది. ‘‘2023 మార్చి 31వ తేదీతో ముగిసిన సంవత్సర కాలంలో ఆర్‌ఈలపై క్షేత్రస్థాయిలో నిర్వహించిన తనిఖీల్లో అవి వడ్డీచార్జీల విషయంలో అనుచిత ధోరణులకు పాల్పడుతున్నట్టు తేలింది’’ అని ఆర్‌బీఐ తాజా సర్క్యులర్‌లో తెలిపింది. ఈ నేపథ్యంలో ఆర్‌ఈలన్నీ రుణ బట్వాడా; వడ్డీ రేట్లు, ఇతర చార్జీల నిర్ణయం విషయంలో తమ ధోరణులను సమీక్షించుకుని వ్యవస్థాపరమైన మార్పులు సహా అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ సర్క్యులర్‌ తక్షణం అమలులోకి వస్తున్నట్టు ఆర్‌బీఐ తెలిపింది. కొన్ని సంస్థలు అనుసరిస్తున్న నిర్దిష్టమైన అనుచిత ధోరణులకు ప్రత్యేకంగా వెలుగులోకి తెచ్చింది. ఆర్‌బీఐ ప్రస్తావించిన కొన్ని అనుచిత ధోరణులివే...


  • రుణగ్రహీతకు వాస్తవంగా రుణం బట్వాడా చేసిన తేదీ నుంచి కాకుండా రుణం మంజూరైన తేదీ నుంచి లేదా రుణ అంగీకారంపై సంతకాలు చేసిన తేదీ నుంచే వడ్డీ వసూలు చేస్తున్నాయి.

  • చెక్కును తయారుచేసిన తేదీ నుంచే ముక్కు పిండి వడ్డీ వసూలు చేస్తూ ఆ తర్వాత ఎన్నో రోజులకు కస్టమర్‌ చేతికి చెక్కును అందిస్తున్నాయి.

  • రుణం తిరిగి చెల్లించే సమయంలో కూడా ఏ తేదీతో అయితే రుణం తీరిపోయిందో అంతవరకు కాకుండా నెల మొత్తానికి వడ్డీ వసూలు చేస్తున్నాయి.

  • కొన్ని కేసుల్లో ఆర్‌ఈలు ఒకటి లేదా రెండు వాయిదాలు అడ్వాన్స్‌గా వసూలు చేసినా పూర్తి రుణ మొత్తానికి వడ్డీ వసూలు చేస్తున్నాయి.

ఈ చర్యలేవీ స్వచ్ఛత, పారదర్శకత పరిధిలోకి రావని, ఇవన్నీ తమను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయని ఆర్‌బీఐ వ్యాఖ్యానించింది. ఆర్‌బీఐ బృందాల తనిఖీలో ప్రస్తావించిన ఈ తరహా కేసులన్నింటిలోనూ ఆర్‌ఈలు కస్టమర్ల నుంచి అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని వాపసు చేయాలని ఆదేశించింది.

Updated Date - Apr 30 , 2024 | 06:25 AM

Advertising
Advertising