Muhurat Trading 2024: ముహూరత్ ట్రేడింగ్‌కు 10 బెస్ట్ స్టాక్స్ ఇవేనట
ABN, Publish Date - Oct 25 , 2024 | 07:51 PM
దీపావళి రోజు నుంచి మార్కెట్లకు కొత్త సంవత్ 2081 ప్రారంభం కానుంది. ఆ రోజున ప్రత్యేకంగా ముహూరత్ ట్రేడింగ్ కూడా జరగనుంది. నవంబర్ 1 శుక్రవారం సాయంత్రం 6:15 నుంచి 7:15 గంటల వరకు ఈ ప్రత్యేక ట్రేడింగ్ జరగనుంది.
దీపావళి పండగ స్టాక్ మార్కెట్ ట్రేడర్లకు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఆ రోజున దేశీయ స్టాక్ మార్కెట్లకు కొత్త ఏడాది ఆరంభమవుతుంది. ఇక సంవత్ 2080లో బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ నిఫ్టీ-50 సూచీలు స్థిరంగా బలపడ్డాయి. ఇరు సూచీలు సరికొత్త గరిష్ఠాలను తాకాయి. రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ పరుగులు పెట్టాయి. అత్యంత వేగంగా వృద్ధి చెందిన మార్కెట్లలో ఒకటిగా నిలిచాయి. ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండడం, ఆదాయాలు బాగుండడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపు, దేశీయ మార్కెట్లలోకి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడుల ప్రవాహంతో మార్కెట్లలలో బుల్ జోరు కనిపించింది. మార్కెట్లు కళకళలాడాయి.
సెప్టెంబర్ 27, 2024న బీఎస్ఈ సెన్సెక్స్ జీవితకాలం గరిష్ఠం 85978.25 పాయింట్లకు చేరింది. ఇక అదే రోజున ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 కూడా కొత్త శిఖరాన్ని అధిరోహించింది. జీవితకాల గరిష్ఠం 26,277.35 పాయింట్ల స్థాయికి చేరింది. సంవత్ 2080లో రెండు సూచీలు దాదాపు 25 శాతం మేర వృద్ధి చెందాయి. నవంబర్ 12, 2023 నాటి నుంచి సెన్సెక్స్ 25 శాతం పెరిగింది. ఇదే సమయంలో బీఎస్ఈ మిడ్‌క్యాప్, బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సూచీలు వరుసగా 49 శాతం. 47 శాతం మేర ఎగబాకాయి.
కాగా దీపావళి రోజు నుంచి మార్కెట్లకు కొత్త సంవత్ 2081 ప్రారంభం కానుంది. ఆ రోజున ప్రత్యేకంగా ముహూరత్ ట్రేడింగ్ కూడా జరగనుంది. నవంబర్ 1 శుక్రవారం సాయంత్రం 6:15 నుంచి 7:15 గంటల వరకు ఈ ప్రత్యేక ట్రేడింగ్ జరగనుంది. గంటపాటు ట్రేడింగ్ జరగనుంది. దీంతో ఆ రోజున ట్రేడింగ్‌కు జేఎం ఫైనాన్షియల్ సంస్థ తన టాప్10 స్టాక్స్‌ను విడుదల చేసింది. ముహూరత్ ట్రేడింగ్ అంటే పెట్టుబడిదారుల పండుగ అని, మార్కెట్‌కు దిశానిర్దేశం చేయనుందని పేర్కొంది.
జేఎం ఫైనాన్షియల్ సూచించిన టాప్-10 స్టాక్స్ ఇవే
1. రిలయన్స్ ఇండస్ట్రీస్ - (టార్గెట్ ప్రైస్ - రూ.3,500)
2. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా - (టార్గెట్ ప్రైస్ - రూ. 383)
3. బజాజ్ ఫైనాన్స్ ( టార్గెట్ ప్రైస్ - రూ.8,552)
4. ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ - (టార్గెట్ ప్రైస్ : రూ. 2,450)
5. జిందాల్ స్టీల్ అండ్ పవర్ (టార్గెట్ ప్రైస్ - రూ. 1,150)
6. నేషనల్ అల్యూమినియం కంపెనీ (టార్గెట్ ప్రైస్ - రూ.264)
7. గ్రావిటా ఇండియా (టార్గెట్ ప్రైస్ - రూ. 3,068)
8. మాక్రోటెక్ డెవలపర్స్ (టార్గెట్ ప్రైస్ - రూ. 1,480)
9. ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ (టార్గెట్ ప్రైస్ - రూ. 2,200)
10. అశోకా బిల్డ్‌కాన్ (టార్గెట్ ప్రైస్ - రూ.290).
Updated Date - Oct 25 , 2024 | 07:54 PM