ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

New IT Rules: ఇవే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త రూల్స్

ABN, Publish Date - Mar 30 , 2024 | 11:18 AM

దేశంలో ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం(new financial year) రాబోతుంది. ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెల నుంచి ఎలాంటి కొత్త నిబంధనలు(new income tax rules) అమల్లోకి వస్తాయి, ఇవి సాధారణ ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం.

దేశంలో ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం(new financial year) రాబోతుంది. ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెల నుంచి ఎలాంటి కొత్త నిబంధనలు(new income tax rules) అమల్లోకి వస్తాయి, ఇవి సాధారణ ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఏప్రిల్ 1, 2024 నుంచి ఆదాయపు పన్ను నిబంధనల్లో(income tax slab) మార్పులు రానున్నాయి. ఈ క్రమంలో ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు. ఈ పెరిగిన మినహాయింపు ద్వారా అనేక మంది పన్ను చెల్లింపుదారులకు ఊరట లభించనుంది. ఈ నేపథ్యంలో రూ.3 లక్షల నుంచి 6 లక్షల ఆదాయంపై 5%, రూ.6 లక్షల నుంచి 9 లక్షల వరకు 10%, రూ.9 లక్షల నుంచి 12 లక్షల వరకు 15%, రూ.12 లక్షల నుంచి 15 లక్షల వరకు 20% పన్ను విధించబడుతుంది. ఆ తర్వాత రూ. 15 లక్షలు, అంతకంటే ఎక్కువ ఆదాయం ఉంటే 30% పన్ను విధించబడుతుంది.

అంతేకాదు ఆదాయపు పన్ను చట్టం(IT Act) 1961లోని సెక్షన్ 87A కింద మినహాయింపు రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచబడింది. అంటే కొత్త విధానంలో రూ. 7 లక్షల వరకు పన్ను విధానం నుంచి తప్పించుకోవచ్చు.


  • ప్రభుత్వేతర ఉద్యోగులకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ పన్ను మినహాయింపు పరిమితి ప్రస్తుతం రూ.3 లక్షలు ఉండగా, అది ఇప్పుడు రూ.25 లక్షలకు పెంచబడింది.

  • గతంలో పాత పన్ను విధానంలో వర్తించే రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ ఇప్పుడు కొత్త పన్ను విధానంలో చేర్చబడింది

  • ఏప్రిల్ 1, 2024 నుంచి కొత్త పన్ను విధానం డిఫాల్ట్ పన్ను విధానం అవుతుంది. అంటే మీరు ఇంకా పన్ను దాఖలు చేసే పద్ధతిని ఎంచుకోకపోతే, మీరు కొత్త పన్ను విధానంలో పన్ను చెల్లిస్తారు.

  • ఇంతకుముందు రూ. 5 కోట్ల కంటే ఎక్కువ ఆదాయంపై 37% సర్‌ఛార్జ్ ఉండేది. ఇప్పుడు దాన్ని 25 శాతానికి తగ్గించారు. అంటే రూ.5 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటే ఇప్పుడు తక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

  • ఏప్రిల్ 1, 2023న లేదా ఆ తర్వాత జారీ చేయబడిన జీవిత బీమా పాలసీల నుంచి మెచ్యూరిటీ రాబడిపై పన్ను విధించబడుతుందని ఆర్థిక మంత్రి ఇప్పటికే ప్రకటించారు. మొత్తం ప్రీమియం రూ.5 లక్షల కంటే ఎక్కువ ఉన్న పాలసీలపై ఈ పన్ను వర్తిస్తుంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Layoffs: మరో టెక్ కంపెనీలో 50% ఉద్యోగుల తొలగింపు.. భయాందోళనలో..

Updated Date - Mar 30 , 2024 | 11:22 AM

Advertising
Advertising