ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ITR Filling 2024: ఈ స్టెప్స్ ఫాలో అయితే సొంతంగా ఐటీఆర్ ఫైలింగ్ దాఖలు చేసుకోవచ్చు!

ABN, Publish Date - Jul 11 , 2024 | 04:58 PM

మదింపు ఏడాది 2024-25కు (ఆర్థిక సంవత్సరం 2024-25) సంబంధించిన ఐటీఆర్ దాఖలు గడువు జులై 31, 2024గా ఉంది. దీంతో చెల్లింపుదారులకు మరో 20 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. పన్ను చెల్లించాలా లేదా రిఫండ్ వస్తుందా అనేది ఆదాయ పన్ను దాఖలు ద్వారానే తెలియజేయాల్సి ఉంటుంది.

ITR filing

మదింపు ఏడాది 2024-25కు (ఆర్థిక సంవత్సరం 2024-25) సంబంధించిన ఐటీఆర్ దాఖలు గడువు జులై 31, 2024గా ఉంది. దీంతో చెల్లింపుదారులకు మరో 20 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. పన్ను చెల్లించాలా లేదా రిఫండ్ వస్తుందా అనేది ఆదాయ పన్ను దాఖలు ద్వారానే తెలియజేయాల్సి ఉంటుంది. కాబట్టి వేతన జీవులైనా లేదా వ్యాపార యజమానులైనా తప్పనిసరిగా ఐటీఆర్ సమర్పించాల్సింది. అయితే గడువు సమీపించే వరకు ఆగకుండా వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవడం మంచిదని ఆదాయ పన్ను నిపుణులు సూచిస్తున్నారు. ముందుగానే ఫైలింగ్ చేసుకుంటే ఏమైనా లోపాలు తలెత్తినా వాటిని సరిదిద్దుకునేందుకు ఛాన్స్ ఉంటుందని సలహా ఇస్తున్నారు. కాగా చెల్లింపుదారులు ఐటీఆర్ దాఖలు చేసేందుకు చార్టర్డ్ అకౌంటెంట్‌లను ఆశ్రయిస్తుంటారు. అలా కాకుండా స్వయంగా ఇంటి వద్దే కూర్చొని ఆన్‌లైన్‌లో ఐటీఆర్ ఫైలింగ్ చేయవచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ పోర్టల్‌పై సులభంగా రిటర్న్‌ దాఖలు చేయవచ్చని పేర్కొంటున్నారు.


అనుసరించాల్సిన ప్రక్రియ ఇదే..

  • ఇన్‌కమ్ డిపార్ట్‌మెంట్ ఈ-ఫైలింగ్ పోర్టల్ incometax.gov.in/iec/foportal/ ఓపెన్ చేయాలి.

  • కొత్త వినియోగదారులైతే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే పాత యూజర్లయితే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్‌ని ఉపయోగించి లాగిన్ కావొచ్చు.

  • పోర్టల్‌లోకి లాగిన్ అయిన తర్వాత ‘ఈ-ఫైల్’ మెనూలోని ‘ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్’ను ఎంపిక చేసుకోవాలి.

  • చెల్లింపుదారులు తమ ఆదాయం ఆధారంగా తగిన ఐటీఆర్ ఫామ్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఫామ్-16 ఉన్న చెల్లింపుదారులైతే ఐటీఆర్-1 లేదా ఐటీఆర్-2 ఫామ్‌ను ఎంచుకోవాలి.

  • మదింపు ఏడాది (అసెస్‌మెంట్ ఇయర్) దగ్గర 2024-25ను ఎంచుకోవాలి.

  • చెల్లింపుదారుడి వ్యక్తిగత వివరాలు, ఆదాయం, మినహాయింపులు, చెల్లించిన పన్ను వంటి వివరాలను తప్పనిసరిగా నింపాల్సి ఉంటుంది.

  • వివరాలన్నింటినీ ఎంటర్ చేశాక పూర్తిగా చెక్ చేసుకొని తప్పులను సరిదిద్దుకోవాలి. అన్ని ధ్రువీకరించుకోవాలి.

  • ఎంటర్ చేసిన డేటా అంతా కరెక్టేనని నిర్ధారించుకున్నాక ‘సబ్మిట్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

  • ఫామ్ సమర్పించిన తర్వాత ఆధార్ ఓటీపీ లేదా అందుబాటులో ఉన్న ఆప్షన్లను ఉపయోగించి రిటర్న్స్‌ను ధ్రువీకరించుకోవాలి.

  • ఆ తర్వాత అప్‌లోడ్‌పై క్లిక్ చేయాలి.


ఐటీఆర్ ఫైలింగ్‌కు ఇవి పక్కా ఉండాలి

ఆన్‌లైన్‌లో ఐటీఆర్ ఫైలింగ్‌ కొన్ని పత్రాలు తప్పనిసరిగా ఉండాలి. ఫామ్-16, ఫారం 16ఏ, ఫారం 26ఏఎస్, క్యాపిటల్ గెయిన్స్ స్టేట్‌మెంట్స్, పన్ను ఆదా పెట్టుబడులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలి. ఐటీఆర్ ఫైలింగ్‌కు ఈ పత్రాలు తప్పనిసరిగా అవసరం.


ఐటీఆర్ ఫైలింగ్ ఎవరికి?

ఐటీఆర్ ఫైలింగ్ అందరూ చేయాల్సిన అవసరం ఉండదు. ఆదాయ పన్ను చాప్టర్ 6-ఏలోని 80సీ, 80సీసీసీ, 80సీసీడీ, 80డీ, 80ఈ, 80జీ, 80జీజీఏ, 80టీటీఏ/80టీటీబీ వంటి వివిధ సెక్షన్‌ల కింద పన్ను మినహాయింపులు పొందిన తర్వాత కూడా పరిమితికి మించిన రాబడి ఉన్నవారు ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇండియాలో లాభదాయకమైన ఆస్తులు ఉండి విదేశాల్లో ఉంటున్న ఎన్నారైలు కూడా తప్పనిసరిగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుందని ఆదాయ పన్ను విభాగం నిబంధనలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

Budget 2024: దేశ ముఖచిత్రాన్ని మార్చిన బడ్జెట్‌లివే

రేపే అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లి.. గెస్టుల కోసం 100 విమానాలు, 3 ఫాల్కన్ జెట్‌లు, ఇంకా..

For more Business News and Telugu News

Updated Date - Jul 11 , 2024 | 05:10 PM

Advertising
Advertising
<