ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Changing Rules: ఆగస్టులో ఈ ధరలు పెరుగుతాయ్.. గమనించగలరు

ABN, Publish Date - Jul 29 , 2024 | 03:56 PM

ప్రతి నెలలాగే ఆగస్టు 1 నుంచి దేశవ్యాప్తంగా పలు నిబంధనల్లో మార్పులు ఉంటాయి. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ నియమాల నుంచి గ్యాస్ సిలిండర్ ధరల వరకు ఆగస్టులో మీ ఖర్చులు ప్రభావితమవుతాయి.

ఇంటర్నెట్ డెస్క్: ప్రతి నెలలాగే ఆగస్టు 1 నుంచి దేశవ్యాప్తంగా పలు నిబంధనల్లో మార్పులు ఉంటాయి. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ నియమాల నుంచి గ్యాస్ సిలిండర్ ధరల వరకు ఆగస్టులో మీ ఖర్చులు ప్రభావితమవుతాయి. కాబట్టి అందుకు అనుగుణంగా మీ బడ్జెట్‌ని సర్దుబాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా మార్పులు జరిగే వాటిని పరిశీలిద్దాం.

1. LPG గ్యాస్ సిలిండర్ ధర: LPG గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెల మొదటి తేదీన నిర్ణయిస్తారు. సిలిండర్ ధరలు ప్రతి ఒక్కరి ఖర్చులను ప్రభావితం చేస్తాయి. జులైలో కేంద్ర ప్రభుత్వం 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను తగ్గించింది. ఆగస్టులో గ్యాస్ సిలిండర్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.


2. హెచ్‌డీఎఫ్‌సీ నిబంధనలు: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. ఆగస్టు 1 నుంచి అనేక మార్పులను తీసుకువస్తోంది. ఇది నేరుగా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లపై ప్రభావం చూపుతుంది. ఆగస్ట్ నుంచి PayTM, CRED, MobiKwik, Cheq వంటి థర్డ్ పార్టీ పేమెంట్ యాప్‌ల ద్వారా చేసిన అన్ని లావాదేవిలపై ఒక శాతం రుసుము అదనంగా పడుతుంది.

రూ.3 వేలు దాటిన ఒక్కో లావాదేవికి ఈ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇంధనం విషయానికి వస్తే.. రూ.15 వేల కంటే తక్కువ లావాదేవీలకు ఎలాంటి అదనపు ఛార్జీలు పడవు. రూ.100 నుంచి రూ.1,300 వరకు బకాయి ఉన్న మొత్తాన్ని బట్టి లేట్ పేమెంట్ ఛార్జ్ ప్రక్రియ సవరించారు. HDFC బ్యాంక్ తన Tata Neu ఇన్ఫినిటీ, Tata Neu Plus క్రెడిట్ కార్డ్‌లలో కూడా ఆగస్ట్ 1 నుంచి మార్పులను చేస్తోంది. Tata New Infinity HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు Tata New UPI IDతో చేసిన UPI లావాదేవీలపై 1.5 శాతం New Coinsని పొందుతారు.

3. గూగుల్ మ్యాప్స్: ఆగస్టు 1 నుంచి గూగుల్ మ్యాప్స్ నియమాల్లో మార్పులు జరగనున్నాయి. చాలా మందిని ఆకర్షించే ప్రయత్నంలో గూగుల్ మ్యాప్స్ దాని సేవల్లో70 శాతం వరకు ఛార్జీలను తగ్గించింది. అదనంగా Google Maps తన సేవలను డాలర్‌ కంటే భారతీయ రూపాయలలో వసూలు చేయనుంది. అయినప్పటికీ ఈ మార్పు సాధారణ వినియోగదారులపై ప్రభావం చూపదు.


4. బంగారం ధరలు: జులై నెల ప్రారంభంలో ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 71 వేల 600 ఉండేది. ఇక నెల మధ్యలో ఇది రూ. 74,730 కి చేరింది. కేంద్ర బడ్జెట్‌ తరువాత బంగారం ధర రూ.7 వేలకుపైగా పతనం అయింది. అయితే వరుస పతనం తర్వాత బంగారం ధరలు ఆగస్టులో మళ్లీ ఎగబాకే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనికి దేశీయ, అంతర్జాతీయ పరిణామాలు దోహదం చేస్తాయని అంటున్నారు.

ముఖ్యంగా మళ్లీ యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచే సంభావ్యత పెరిగిందని.. తద్వారా డాలర్, బాండ్ ఈల్డ్స్ డిమాండ్ తగ్గి.. ఇది బంగారం డిమాండ్ పెంచేందుకు కారణమవుతుందని అంటున్నారు కేడియా అడ్వైజరీ డైరెక్టర్ అజయ్ కేడియా. తద్వారా మంచి డిమాండ్‌తో గోల్డ్ రేట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన సమీప భవిష్యత్తులో బంగారం ధరలు పెరిగేందుకే ఎక్కువ ఛాన్స్ ఉందని చెబుతున్నారు. యూఎస్ ఫెడ్ ప్రకటన ఇందులో కీలకంగా వ్యవహరిస్తుందని అన్నారు.

For Latest News and National News click here

Updated Date - Jul 29 , 2024 | 04:42 PM

Advertising
Advertising
<