ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆ మూడు బ్యాంకులే కీలకం

ABN, Publish Date - Nov 14 , 2024 | 03:27 AM

బ్యాంకింగ్‌ రంగంలో ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు అత్యంత కీలకమని ఆర్‌బీఐ తెలిపింది. ఆర్‌బీఐ ఈ బ్యాంకులను దేశంలో వ్యవస్థీకృతంగా అత్యంత కీలక బ్యాంకులుగా (డీ-ఎస్‌ఐబీ) వర్గీకరించింది...

ఆర్‌బీఐ జాబితాలో ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకు

ముంబై: బ్యాంకింగ్‌ రంగంలో ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు అత్యంత కీలకమని ఆర్‌బీఐ తెలిపింది. ఆర్‌బీఐ ఈ బ్యాంకులను దేశంలో వ్యవస్థీకృతంగా అత్యంత కీలక బ్యాంకులుగా (డీ-ఎస్‌ఐబీ) వర్గీకరించింది. దీనికి సంబంధించి బుధవారం ఒక జాబితా విడుదల చేసింది. కొన్ని నిర్దిష్ట ప్రమాణాలకు లోబడి ఈ బ్యాంకులు కామన్‌ ఈక్విటీ టైర్‌ 1 (సీఈటీ1) కంటే అధిక మూలధన నిల్వలు కలిగి ఉండాలి. తాజా వర్గీకరణ ప్రకారం ఎస్‌బీఐని బకెట్‌ 4లో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకును బకెట్‌ 2లో, ఐసీఐసీఐ బ్యాంకును బకెట్‌ 1లో ఆర్‌బీఐ చేర్చింది.


దీని ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఎస్‌బీఐ తన సీఈటీ 1 కంటే 0.80 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 0.40 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 0.20 శాతం అధిక మూలధన నిల్వలు కలిగి ఉండాలి. ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు ఈ బ్యాంకుల ఆర్థిక స్థితిగతులను పరిశీలించాక ఈ వర్గీకరణ చేసినట్టు ఆర్‌బీఐ తెలిపింది.

Updated Date - Nov 14 , 2024 | 03:27 AM