Nirmala Sitharaman : శక్తిమంత నిర్మల
ABN, Publish Date - Dec 14 , 2024 | 05:58 AM
ప్రపంచ సంపన్నుల జాబితాలోనే కాదు, అత్యంత శక్తిమంతులైన మహిళల జాబితాలోనూ భారతీయులు దూసుకుపోతున్నారు. ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన ప్రపంచంలో అత్యంత శక్తిమంతులైన మహిళల తాజా జాబితాలో ముగ్గురు భారతీయులకు స్థానం దొరికింది.
ఫోర్బ్స్ అత్యంత శక్తిమంతమైన మహిళల
జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి
కిరణ్ మజుందార్ షా, రోష్ని నాడార్‌కూ స్థానం
న్యూఢిల్లీ: ప్రపంచ సంపన్నుల జాబితాలోనే కాదు, అత్యంత శక్తిమంతులైన మహిళల జాబితాలోనూ భారతీయులు దూసుకుపోతున్నారు. ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన ప్రపంచంలో అత్యంత శక్తిమంతులైన మహిళల తాజా జాబితాలో ముగ్గురు భారతీయులకు స్థానం దొరికింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్‌పర్సన్, హెచ్‌సీఎల్ కార్పొరేషన్ సీఈఓ రోష్ని నాడార్ మల్హోత్రా, బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా ఈ జాబితాలో స్థానం సంపాదించారు. ప్రపంచంలో అత్యంత శక్తిమంతులైన మహిళల్లో నిర్మలా సీతారామన్‌కు 28వ స్థానం, రోష్ని నాడార్ మల్హోత్రాకు 81వ స్థానం, కిరణ్ మజుందార్ షాకు 82వ స్థానం దక్కాయి. ఈయూ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్‌డెర్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ క్రిస్టినా లగార్డె, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఈ జాబితాలో అగ్రస్థానం సంపాదించారు.
Updated Date - Dec 14 , 2024 | 05:58 AM