ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఫినోమ్‌ చేతికి టైడీ

ABN, Publish Date - Jul 03 , 2024 | 02:05 AM

హ్యూమన్‌ రీసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌) టెక్నాలజీ సంస్థ ఫినోమ్‌.. మానవ వనరుల విభాగంలోని స్టార్టప్‌ టైడీని కొనుగోలు చేసింది...

వచ్చే ఏడాది కాలంలో 1,000 నియామకాలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హ్యూమన్‌ రీసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌) టెక్నాలజీ సంస్థ ఫినోమ్‌.. మానవ వనరుల విభాగంలోని స్టార్టప్‌ టైడీని కొనుగోలు చేసింది. అయితే డీల్‌ విలువను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. ఈ రెండు సంస్థలు అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. కాగా ఫినోమ్‌.. అమెరికాతో పాటు హైదరాబాద్‌, విశాఖపట్నంలో కార్యాలయాలను నిర్వహిస్తుండగా టైడీ బెంగళూరు కేంద్రంగా సెంటర్‌ను నిర్వహిస్తోంది. ఈ కొనుగోలుతో హెచ్‌ఆర్‌ కార్యకలాపాలను మరింత సులభతరం చేయటంతో పాటు నైపుణ్యం కలిగిన ఉద్యోగులను ఎంపిక చేసుకునేందుకు అవసరమైన టెక్నాలజీలను అందించే వీలు కలుగుతుందని ఫినోమ్‌ సీఈఓ మహి బైరెడ్డి తెలిపారు. ప్రస్తుతం కంపెనీ ఉద్యోగుల సంఖ్య 1,600గా ఉందని, ఒక్క హైదరాబాద్‌ సెంటర్‌లోనే 900 ఉద్యోగులు పనిచేస్తుండగా విశాఖలో 150 వరకు ఉద్యోగులు ఉన్నారని ఫినోమ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శివానంద్‌ ఆకెళ్ల తెలిపారు. కాగా వచ్చే ఏడాది కాలంలో కొత్తగా మరో 1,000 మందిని నియమించుకోవాలని చూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కంపెనీకి 700కు పైగా క్లయింట్లు ఉన్నారని తెలిపారు.

Updated Date - Jul 03 , 2024 | 02:05 AM

Advertising
Advertising