ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gold Rates: శ్రావణమాసం వేళ.. భారీగా తగ్గిన పసిడి ధరలు..

ABN, Publish Date - Aug 07 , 2024 | 07:25 AM

శ్రావణమాసం అంటేనే మహిళలకు పండగ. అలాంటి వేళ.. పసిడి ధర దాదాపు వెయ్యి రూపాయిల వరకు తగ్గింది. అంతేకాదు.. బంగారం, వెండి ధరల్లో సైతం మార్పు చోటు చేసుకుంది. నిన్న అంటే మంగళవారం ఒక్క రోజే వీటి ధరల్లో ఊహించని మార్పు కనిపించిందని మార్కెట్ విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు.

Gold Rates

శ్రావణమాసం అంటేనే మహిళలకు పండగ. అలాంటి వేళ.. పసిడి ధర దాదాపు వెయ్యి రూపాయిల వరకు తగ్గింది. అంతేకాదు.. వెండి ధరలో మార్పు చోటు చేసుకుంది. నిన్న అంటే మంగళవారం ఒక్క రోజే వీటి ధరల్లో ఊహించని మార్పు కనిపించిందని మార్కెట్ విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు. ఇటీవల సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం పసిడి ధరలు క్రమక్రమంగా దిగి వస్తున్నాయని మహిళా మణులు సైతం అభిప్రాయపడుతున్నారు.


తాజాగా ఆగస్ట్ 7వ తేదీన దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63,890 ఉండగా... ఇక మేలిమి బంగారం, అంటే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 69,700 వద్ద ఉంది. అంటే నిన్నటికి ఈ రోజుకు బంగారం ధరల్లో తేడా దాదాపు వెయ్యి రూపాయిల మేర తగ్గినట్లు సుస్పష్టమవుతుంది. మరి ఈ ధరలు ఇలా స్థిరంగా ఉండవచ్చు. లేదా పెరగవచ్చు. అలా కాకుంటే తగ్గనూ వచ్చు. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.


తెలుగు రాష్ట్రాల్లో ఇలా..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,890 ఉంది. ఇక మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.69,700గా ఉంది. అలాగే విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,890 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.69,700గా ఉంది.


దేశంలోని వివిధ నగరాల్లో ఇలా..

దేశ రాజధాని న్యూఢిల్లీ మహానగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,040గా ఉంది. మేలిమి బంగారం ధర రూ.69,850 ఉంది. ఇక వాణిజ్య రాజధాని ముంబయి మహానగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,890 ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.69,700 ఉంది.


అలాగే చెన్నై మహానగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,470 ఉండగా, మెలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.70,590గా వద్ద ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.69,810 వద్ద ఉంది.


కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,890 ఉండగా, మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ. 69,700 వద్ద ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,890 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.69,700 వద్ద కొనసాగుతోంది.


ఇక బంగారం బాటలోనే వెండి ధర పయనిస్తుంది. ఒకే ఒక్క రోజులో రూ. 3 వేల రూపాయిలకుపైగా తగ్గింది. ఇక దేశీయంగా కిలో వెండి ధర రూ.82,400గా ఉంది. అయితే కొన్ని నగరాల్లో మాత్రం వెండి ధరల్లో హెచ్చు తగ్గులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే హైదరాబాద్‌, తిరువనంతపురం, చెన్నై మహా నగరాల్లో మాత్రం వెండి ధర భారీగానే ఉంది. ఆ యా నగరాల్లో కిలో వెండి రూ.87,400 ఉండగా, మిగితా ప్రాంతాల్లో రూ.82,400 వద్ద కొనసాగుతోంది.


Read More Business News
and Latest Telugu News

Updated Date - Aug 07 , 2024 | 07:33 AM

Advertising
Advertising
<