ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నేటితో విస్తారా కథ కంచికి..

ABN, Publish Date - Nov 11 , 2024 | 02:51 AM

దేశ విమానయాన రంగంలో మరో కంపెనీ పేరు అదృశ్యమవుతోంది. సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌తో కలిసి 2015లో టాటా గ్రూప్‌ ఏర్పాటు చేసిన విస్తారా ఎయిర్‌లైన్స్‌ సోమవారం నుంచి టాటా గ్రూప్‌లోని ఎయిర్‌ ఇండియాలో విలీనమవుతోంది...

ఎయిర్‌ ఇండియాలో విలీనం

ముంబై/న్యూఢిల్లీ: దేశ విమానయాన రంగంలో మరో కంపెనీ పేరు అదృశ్యమవుతోంది. సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌తో కలిసి 2015లో టాటా గ్రూప్‌ ఏర్పాటు చేసిన విస్తారా ఎయిర్‌లైన్స్‌ సోమవారం నుంచి టాటా గ్రూప్‌లోని ఎయిర్‌ ఇండియాలో విలీనమవుతోంది. విస్తారా ఎయిర్‌లైన్స్‌ ఈక్విటీలో ప్రస్తుతం టాటా గ్రూప్‌నకు 51 శాతం, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు 49 శాతం వాటా ఉంది. విలీనం తర్వాత ఎయుర్‌ ఇండియా ఈక్విటీలో సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు 25.1 శాతం వాటా ఉంటుంది. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం దేశీయ విమానయాన కంపెనీల ఈక్విటీలో 49 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను అనుమతిస్తూ 2012లో నిర్ణయం తీసుకుంది. దీంతో టాటా గ్రూప్‌ 51 శాతం, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ 49 శాతం వాటాతో 2015 జనవరిలో విస్తారా ఎయిర్‌లైన్స్‌ను ప్రారంభించాయి.


మరింత పట్టు

టాటా గ్రూప్‌ 2022లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎయిర్‌ ఇండియాను కొనుగోలు చేసింది. అక్కడి నుంచి తన నిర్వహణలోని ఎయిర్‌ ఏషియా ఇండియా, విస్తారా ఎయిర్‌లైన్స్‌ను ఎయిర్‌ ఇండియాలో విలీనం చేస్తోంది. ఈ విలీనంతో ఎయిర్‌ ఇండియా ఒక్కటే దేశంలో ఫుల్‌ సర్వీస్‌ క్యారియర్‌గా నిలిచిపోనుంది. కాగా గత 17 సంవత్సరాల్లో కింగ్‌ఫిషర్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌తో సహా ఐదు ఫుల్‌ సర్వీస్‌ క్యారియర్స్‌ మూతపడ్డాయి. విస్తారా విలీనంతో దేశ విమానయాన రంగంపై టాటా గ్రూప్‌ పట్టు మరింత పెరగనుంది.


సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌

రూ.3,195 కోట్ల పెట్టుబడి

విలీనం తర్వాత ఎయిర్‌ ఇండియా ఈక్విటీలో 25.1 శాతం వాటా కోసం సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ గ్రూప్‌.. టాటా గ్రూప్‌నకు మరో రూ.3,195 కోట్లు సమకూర్చనుంది. ఈ మొత్తం ఈ నెలలోనే టాటా గ్రూప్‌నకు అందనుంది.

పైలెట్ల అసంతృప్తి

అయితే ఈ విలీనంపై ఎయిర్‌ ఇండియాకు చెందిన కొంత మంది పైలెట్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ పదవీ విరమణ వయసు 58 ఏళ్లకు, విస్తారా పైలెట్ల రిటైర్మెంట్‌ వయసు 60 ఏళ్లుగా ఉండడం ఇందుకు ప్రధాన కారణం. వెంటనే ఈ వ్యత్యాసాన్ని సరిదిద్దాలని వారు ఇప్పటికే టాటా గ్రూప్‌ను కోరారు.

Updated Date - Nov 11 , 2024 | 02:51 AM