ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ట్రంప్‌ హెచ్చరికలో పస లేదు

ABN, Publish Date - Dec 03 , 2024 | 05:40 AM

బ్రిక్స్‌ దేశాలు డాలర్‌కు ప్రత్యామ్నాయ కరెన్సీనీ తీసుకొస్తే ఆ దేశాల దిగుమతులపై 100 శాతం సుంకాలు తప్పవన్న డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరికపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి....

  • డాలర్‌ ఆధిపత్యం ఏ మాత్రం తగ్గదు

  • బ్రిక్స్‌ ఉమ్మడి కరెన్సీతో చైనాకే మేలు

  • ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు

హైదరాబాద్‌: బ్రిక్స్‌ దేశాలు డాలర్‌కు ప్రత్యామ్నాయ కరెన్సీనీ తీసుకొస్తే ఆ దేశాల దిగుమతులపై 100 శాతం సుంకాలు తప్పవన్న డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరికపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ హెచ్చరికలో స్పష్టత లేదని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు అన్నారు. అమెరికా చట్టాలు అందుకు అనుమతిస్తాయా? లేదా? అనే విషయాన్నీ పరిశీలించాల్సి ఉందన్నారు. డాలర్‌ ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు బ్రిక్స్‌ దేశాలు ఒకే ఉమ్మడి కరెన్సీని తీసుకు వచ్చే అవకాశాలపైనా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ దేశాల ఆర్థిక, రాజకీయ పరిస్థితులూ ఇందుకు అనుమతించే అవకాశం లేదన్నారు. ట్రంప్‌ను మాటల మనిషిగా చూడాలే తప్ప, చేతల మనిషిగా చూడలేమని సుబ్బారావు స్పష్టం చేశారు.


బ్రిక్స్‌ ఉమ్మడి కరెన్సీ కోసం భారత్‌ వంటి దేశాలు తమ ద్రవ్య విధానాలు, స్వయం ప్రతిపత్తి వదులుకుని బ్రిక్స్‌లోని ఇతర దేశాల్లో ఏర్పడే ఆటుపోట్లకు సిద్ధమవుతాయా? అనే విషయాన్నీ ఆలోచించాల్సి ఉందన్నారు. ఒకవేళ అదే జరిగితే బ్రిక్స్‌ దేశాలపై చైనా ఆధిపత్యం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Updated Date - Dec 03 , 2024 | 05:55 AM