ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఒక షేరుకు రెండు షేర్లు

ABN, Publish Date - Nov 12 , 2024 | 06:00 AM

ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎండీసీ.. వాటాదారులకు 2ః1 నిష్పత్తిలో బోనస్‌ షేర్లు జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. రూ.1 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రెండు ఈక్విటీ షేర్లను...

ఎన్‌ఎండీసీ బోనస్‌ ఇష్యూ

సెప్టెంబరు త్రైమాసిక లాభంలో 17% వృద్ధి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎండీసీ.. వాటాదారులకు 2ః1 నిష్పత్తిలో బోనస్‌ షేర్లు జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. రూ.1 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రెండు ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నట్లు వెల్లడించింది. బోనస్‌ షేర్ల జారీకి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. కాగా కంపెనీ వాటాదారుల అనుమతికి లోబడి ఈ షేర్ల జారీ ఉంటుందని తెలిపింది. అర్హులైన వాటాదారులకు రికార్డు తేదీ నాడు ఈ బోనస్‌ షేర్లను జారీ చేయనున్నట్లు పేర్కొంది. 2008 తర్వాత కంపెనీ బోనస్‌ షేర్లను జారీ చేయటం ఇదే తొలిసారి. అప్పుడు కూడా కంపెనీ 2ః1 నిష్పత్తిలోనే బోనస్‌ షేర్లను జారీ చేసింది. కాగా కంపెనీ అధీకృత మూలధనాన్ని కూడా రూ.400 కోట్ల నుంచి రూ.1,000 కోట్లకు పెంచేందుకు బోర్డు ఆమోదం తెలిపిందని ఎన్‌ఎండీసీ తెలిపింది.


క్యూ2 లాభం రూ.1,196 కోట్లు: సెప్టెంబరుతో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో ఎన్‌ఎండీసీ నికర లాభం కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన 17ువృద్ధి చెంది రూ.1,195.63 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.1,024.86 కోట్లుగా ఉంది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం కూడా 22 శాతం వృద్దితో రూ.4,335.02 కోట్ల నుంచి రూ.5,279.68 కోట్లకు పెరిగింది.

Updated Date - Nov 12 , 2024 | 06:00 AM