మరో పదేళ్ల పాటు ‘ఉడాన్’ పథకం
ABN, Publish Date - Oct 22 , 2024 | 12:51 AM
ప్రాంతీయ విమానాశ్రయాలను అనుసంధానం చేసే ‘ఉడాన్’ పథకాన్ని మరో పదేళ్ల పాటు పొడిగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి...
న్యూఢిల్లీ: ప్రాంతీయ విమానాశ్రయాలను అనుసంధానం చేసే ‘ఉడాన్’ పథకాన్ని మరో పదేళ్ల పాటు పొడిగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ విషయం ప్రకటించారు. ప్రాంతీయ విమానయాన అనుసంధానం కోసం కేంద్ర ప్రభుత్వం 2016 అక్టోబరు 21న ఈ పథకాన్ని ప్రారంభించింది. దీంతో అనేక ప్రాంతీయ విమానయాన సంస్థలు ప్రారంభమై అనేక మందికి ఉద్యోగావకాశాలు ఏర్పడడంతో పాటు దేశంలో పర్యాటక రంగ అభివృద్ధికి తోడ్పడిందని రామ్మోహన్ తెలిపారు. ఈ పథకం పుణ్యమాని 601 విమాన మార్గాలు, 71 విమానాశ్రయాలు అందుబాటులోకి వచ్చాయి.
Updated Date - Oct 22 , 2024 | 12:51 AM