యూనికార్న్ ఆశలు గల్లంతు
ABN, Publish Date - Jun 21 , 2024 | 01:36 AM
యూనికార్న్ హోదా సాధించాలన్న దేశీయ స్టార్ట్‌పల ఆశలు గల్లంతవుతున్నాయి. అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా స్టార్ట్‌పల్లోకి కొత్త పెట్టుబడులు దాదాపుగా నిలిచిపోవడంతో పాటు ఈ రంగంపై ఆర్థిక నియంత్రణ మండలుల చర్యలు...
హురున్ భవిష్యత్ యూనికార్న్‌ల
జాబితా నుంచి 25 స్టార్ట్‌పలు అవుట్
పెట్టుబడుల కొరత, నియంత్రణ చర్యలే కారణం
ముంబై: యూనికార్న్ హోదా సాధించాలన్న దేశీయ స్టార్ట్‌పల ఆశలు గల్లంతవుతున్నాయి. అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా స్టార్ట్‌పల్లోకి కొత్త పెట్టుబడులు దాదాపుగా నిలిచిపోవడంతో పాటు ఈ రంగంపై ఆర్థిక నియంత్రణ మండలుల చర్యలు, వేల్యువేషన్ పెంపునకు బదులు లాభదాయకతపై దృష్టి సారించాలని ఇన్వెస్టర్లు పట్టుబడుతుండటం ఇందుకు ప్రధాన కారణాలట. గురువారం విడుదలైన ‘ఆస్క్ ప్రైవేట్ వెల్త్ హురున్ ఇండియన్ ఫ్యూచర్ యూనికార్న్ ఇండెక్స్ 2024’ రిపోర్టు ఈ విషయాన్ని వెల్లడించింది. కనీసం బిలియన్ డాలర్ల (100 కోట్ల డాలర్లు= రూ.8,350 కోట్లు) మార్కెట్ విలువ కలిగిన స్టార్ట ప్‌లను యూనికార్న్‌లుగా పిలుస్తారు. గత ఏడాది దేశంలో 68 యూనికార్న్‌లు ఉండగా.. ఈ ఏడాదిలో ఆ సంఖ్య 67కు తగ్గింది. అంతేకాదు, భవిష్యత్‌లో యూనికార్న్‌లుగా ఎదిగేందుకు అవకాశాలున్న స్టార్ట్‌పల జాబితాలో ఏకంగా 25 స్టార్ట్‌పలు స్థానం కోల్పోయాయి. మూడేళ్లలో యూనికార్న్‌లుగా ఎదిగేందుకు అవకాశాలున్న, 50 కోట్ల డాలర్లకు పైగా విలువైన 5 స్టార్ట్‌పలు సైతం అందులో ఉన్నాయని నివేదిక వెల్లడించింది.
ఈ ఏడాది ప్రథమార్ధంలో
టెక్ స్టార్ట్‌పల్లోకి 410 కోట్ల డాలర్ల పెట్టుబడులు
ఈ ఏడాది ప్రథమార్ధంలో దేశీయ టెక్నాలజీ స్టార్ట్‌పలు మొత్తం 410 కోట్ల డాలర్ల పెట్టుబడులను సమీకరించగలిగాయని మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ ట్రాక్సాన్ తాజా నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్త టెక్ స్టార్ట్‌పల విభాగంలో అత్యధిక ఫండింగ్ లభించిన దేశాల్లో అమెరికా, యూకే, చైనా తర్వాత భారత్ నాలుగో స్థానంలో నిలిచిందని రిపోర్టు తెలిపింది. అయితే, గత ఏడాది ప్రథమార్ధంలో సేకరించిన 480 కోట్ల డాలర్లతో పోలిస్తే ఈ ఏడాది ఆరు నెలల్లో పెట్టుబడులు 13 శాతం తగ్గాయి. 2023 ద్వితీయార్ధంలో (జూలై-డిసెంబరు) సేకరించిన 396 కోట్ల డాలర్ల పెట్టుబడితో పోలిస్తే మాత్రం 4 శాతం పెరిగాయని రిపోర్టు పేర్కొంది.
Updated Date - Jun 21 , 2024 | 01:36 AM