UPI: బ్యాంక్ అకౌంట్ లేకపోయినా.. యూఐపీ పేమెంట్లు.. ఇలా చేస్తే చాలు
ABN, Publish Date - Nov 10 , 2024 | 10:17 AM
బ్యాంక్ అకౌంట్ లేని పిల్లలతో పాటు కొందరు యూపీఐ పేమెంట్లు వినియోగించలేకపోతున్నారు. అయితే బ్యాంక్ అకౌంట్లు లేనివారు కూడా యూపీఐ చెల్లింపులు చేసేందుకు చేసేందుకు ఒక అవకాశం ఉంది.
యూపీఐ పేమెంట్లు అందుబాటులోకి వచ్చాక డిజిటల్ పేమెంట్లు చాలా ఈజీగా మారిపోయాయి. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చెల్లింపులు జరుగుతున్నాయి. ఈ పేమెంట్లు వినియోగిస్తున్నవారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. అయితే బ్యాంక్ అకౌంట్ లేని పిల్లలతో పాటు కొందరు యూపీఐ పేమెంట్లు వినియోగించుకోలేకపోతున్నారు. అయితే బ్యాంక్ అకౌంట్లు లేనివారు కూడా యూపీఐ చెల్లింపులు చేసేందుకు చేసేందుకు ఒక అవకాశం ఉంది. యూపీఐ సర్కిల్ ఫీచర్‌ను ఉపయోగించి ఒక్క బ్యాంక్ అకౌంట్‌తో కుటుంబ సభ్యులు అందరూ చెల్లింపులు చేసుకునే సౌలభ్యం ఉంది. వ్యక్తిగతంగా బ్యాంక్ అకౌంట్లు లేనివారికి ఈ ఫీచర్ సౌకర్యవంతంగా ఉంటుంది.
అసలేంటి యూపీఐ సర్కిల్
యూపీఐ సర్కిల్ ఫీచర్ ద్వారా బ్యాంక్ ఖాతాలు లేని కుటుంబ సభ్యులు కూడా ఒకే ఉమ్మడి షేర్డ్ బ్యాంక్ అకౌంట్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేయడానికి వీలుకల్పిస్తుంది. ప్రైమరీ అకౌంట్ హోల్డర్లు తమ కుటుంబంలోని వృద్ధులు, జీవిత భాగస్వామి లేదా పిల్లలతో సహా గరిష్ఠంగా ఐదుగురిని యాడ్ చేసుకోవచ్చు. యూపీఐ పేమెంట్ల సౌలభ్యాన్ని మరింత విస్తృతం చేయడమే లక్ష్యంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
పాటించాల్సిన స్టెప్స్ ఇవే..
భిమ్ (BHIM-UPI) యాప్‌ను ఉదాహరణగా తీసుకొని యూపీఐ సర్కిల్‌లో సెకండరీ యూజర్లను ఎలా రిజిస్టర్ చేయాలో చూద్దాం...
భిమ్ యూపీఐ (BHIM-UPI) యాప్‌ని ఓపెన్ చేసి యూపీఐ సర్కిల్‌ను (UPI Circle) ఎంచుకోవాలి. ‘యూపీఐ సర్కిల్’పై క్లిక్ చేసి కుటుంబ సభ్యులను యాడ్ చేయాలి. అందుకోసం ‘ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ యాడ్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత యాడ్ చేయాలనుకుంటున్న వ్యక్తి యూపీఐ క్యూఆర్ కోడ్‌ను (QR Code) స్కాన్ చేయవచ్చు లేదా వారి యూపీఐ ఐడీని ఎంటర్ చేయవచ్చు.
యూపీఐ ఐడీని ఎంటర్ చేసిన తర్వాత ‘యాడ్ టు మై యూపీఐ సర్కిల్’పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత కాంటాక్ట్స్ లిస్టు నుంచి ఎంచుకున్న వ్యక్తుల ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత ఎలాంటి యాక్సెస్ ఇవ్వదలుచుకున్నారో సెట్ చేయాల్సి ఉంటుంది. పరిమితులతో కూడిన పేమెంట్లు’ లేదా ప్రతి చెల్లింపునక అనుమతి’.. ఈ రెండింటిలో ఒక దానిని ఎంచుకోవాలి. పేమెంట్ పరిమితులను సెట్ చేసిన తర్వాత యూపీఐ పిన్‌ను ఎంటర్ చేసి నిర్ధారించాల్సి ఉంటుంది. తద్వారా బ్యాంక్ అకౌంట్ లేని కుటుంబ సభ్యులు కూడా సులభంగా యూపీఐ పేమెంట్లు చేసేవిధంగా వీలుకల్పించవచ్చు.
Updated Date - Nov 10 , 2024 | 10:18 AM