ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పెళ్లిళ్ల వ్యాపారం.. ఏటా రూ.10 లక్షల కోట్లు

ABN, Publish Date - Jul 01 , 2024 | 05:30 AM

భారత్‌లో ఇప్పుడు పెళ్లిళ్లు కూడా పెద్ద బిజినె్‌సగా మారాయి. ఈ బిజినెస్‌ ఎంత లేదన్నా ఏటా రూ.10 లక్షల కోట్లు (13.000 కోట్ల డాలర్లు) ఉంటుందని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ జెఫ్రీస్‌ ఒక నివేదికలో...

అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ జెఫ్రీస్‌ వెల్లడి

న్యూఢిల్లీ: భారత్‌లో ఇప్పుడు పెళ్లిళ్లు కూడా పెద్ద బిజినె్‌సగా మారాయి. ఈ బిజినెస్‌ ఎంత లేదన్నా ఏటా రూ.10 లక్షల కోట్లు (13.000 కోట్ల డాలర్లు) ఉంటుందని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ జెఫ్రీస్‌ ఒక నివేదికలో తెలిపింది. రిటైల్‌గా చూస్తే ఆహారం, చిల్లర సరుకుల తరువాత దేశం లో ఇదే అతిపెద్ద వ్యాపారమని పేర్కొంది. నిశ్చితార్థం మొదలుకొని, విందులు, వినోదాలు, నగనట్రా, పెళ్లి బట్టల కొనుగోలు, రవాణా కోసం చేసే ఖర్చులను పరిగణనలోకి తీసుకుని జెఫ్రీస్‌ ఈ నివేదిక రూపొందించింది.


జోరుజోరుగా వివాహ బిజినెస్‌.. సగటు వివాహ ఖర్చు రూ.12.5 లక్షలు

ఏటా కోటి వివాహాలు

మన దేశంలో ఏటా 80 లక్షల నుంచి కోటి పెళ్లి ళ్లు జరుగుతున్నాయి. ఒక్కో పెళ్లికి సగటున రూ. 12.5 లక్షలు ఖర్చు చేస్తున్నట్టు అంచనా. పిల్లల చ దువుల మీద పెట్టే ఖర్చుల కంటే తల్లిదండ్రులు రెండింతలు పిల్లల పెళ్లిళ్ల మీద ఖర్చు చేస్తున్నారు. ఆర్థిక స్థోమత అంతంతమాత్రంగా ఉన్నా పిల్లల పెళ్లిళ్లు మాత్రం ఘనంగా చేసేందుకు తల్లిదండ్రు లు మొగ్గు చూపుతున్నారని తెలిపింది. ఇక బడాబా బులైతే దేశంలోని ప్రముఖ ప్రదేశాలు, విదేశాల్లోని ప్రముఖ ప్రదేశాల్లో తమ పిల్లల పెళ్లిళ్లు చేస్తున్నారు.

ఖర్చుల్లో చైనాదే అగ్ర స్థానం

అమెరికా, చైనాలతో పోలిస్తే మన దేశంలో ఏటా జరిగే పెళ్లిళ్లే ఎక్కువ. చైనాలో ఏటా 70-80 లక్షల పెళ్లిళ్లు జరుగుతుంటే అమెరికాలో ఏటా జరిగే పెళ్లిళ్లు 20 నుంచి 25 లక్షలు మాత్రమే. మన దేశంలో మాత్రం ఏటా 80 లక్షల నుంచి కోటి జం టలు పెళ్లితో ఒకటవుతున్నాయి. చైనాలో ఏటా 70- 80 లక్షల పెళ్లిళ్లు జరిగినా ఖర్చులపరంగా చూస్తే మన కంటే చాలా ముందుంది. అక్కడ పెళ్లిళ్ల కారణంగా జరిగే వార్షిక వ్యాపారం రూ.14.17 లక్షల కోట్ల వరకు ఉంటుందని జెఫ్రీస్‌ సంస్థ అంచనా.

Updated Date - Jul 01 , 2024 | 05:30 AM

Advertising
Advertising