ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minimum Balance: అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచట్లేదా.. ఏ బ్యాంక్ ఎంత ఛార్జ్ చేస్తుందంటే?

ABN, Publish Date - Aug 14 , 2024 | 05:42 PM

మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయనందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ ఖాతాదారుల నుంచి ఏకంగా రూ.8 వేల 495 కోట్లు వసూలు చేసినట్లు ఇటీవలే ఓ వార్త చక్కర్లు కొట్టింది. ఈ సమాచారం దేశ బ్యాంకింగ్ రంగ చరిత్రలో సంచలనం సృష్టించింది.

ఢిల్లీ: మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయనందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ ఖాతాదారుల నుంచి ఏకంగా రూ.8 వేల 495 కోట్లు వసూలు చేసినట్లు ఇటీవలే ఓ వార్త చక్కర్లు కొట్టింది. ఈ సమాచారం దేశ బ్యాంకింగ్ రంగ చరిత్రలో సంచలనం సృష్టించింది. దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ (SBI) గత కొన్ని సంవత్సరాలుగా మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయనందుకు ఎలాంటి రుసుము వసూలు చేయలేదు. కాగా.. అనేక ఇతర ప్రభుత్వ బ్యాంకులు ఛార్జీలను విధిస్తూనే ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) గత ఐదేళ్లలో అత్యధికంగా రూ.1,538 కోట్ల పెనాల్టీని వసూలు చేసింది. మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయనందుకు వివిధ బ్యాంకులు విధించే ఛార్జీలను పరిశీలిద్దాం.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)

2020 నుంచి ఎస్‌బీఐ మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయనందుకు ఎలాంటి ఛార్జీలు విధించలేదు.

ICICI బ్యాంక్

ఈ బ్యాంక్‌లో కనీస బ్యాలెన్స్ రూ. 5000 అవసరం. మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకపోతే కనీస సగటు బ్యాలెన్స్ (MAB) లోటులో రూ.100 + 5 శాతం జరిమానా విధిస్తుంది.


HDFC బ్యాంక్

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అకౌంట్‌లో సగటు నెలవారీ బ్యాలెన్స్ రూ.10 వేలు అవసరం. మెట్రో, పట్టణ ప్రాంతాల్లో ఒక సంవత్సరం, ఒక రోజు FD కోసం రూ.1 లక్ష, సెమీ-అర్బన్ ప్రాంతాలకు ఒక సంవత్సరం, ఒక రోజు FD కోసం రూ. 5 వేలు లేదా రూ. 50 వేలు అవసరం. ఈ నియమాన్ని కొనసాగించడంలో విఫలమైతే సగటు బ్యాలెన్స్‌లో 6 శాతం కోత లేదా రూ. 600 (ఏది తక్కువైతే అది) జరిమానా విధిస్తారు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)

పీఎన్‌బీ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయనందుకు గ్రామీణ ప్రాంతాలకు రూ.400, సెమీ అర్బన్ అయితే రూ.500, అర్బన్/మెట్రో ప్రాంతాల్లో రూ.600 జరిమానా విధిస్తారు.


యస్ బ్యాంక్

కనీస బ్యాలెన్స్ ఛార్జీలు విధించదు.

యాక్సిస్ బ్యాంక్

బేసిక్ సేవింగ్స్ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచకపోతే యాక్సిస్ బ్యాంక్ ఎలాంటి ఛార్జీలు విధించదు. కాగా మెట్రో, పట్టణ ప్రాంతాల్లో రూ.50 నుంచి రూ.600, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.50 నుంచి రూ.300, గ్రామీణ ప్రాంతాల్లో రూ.75 నుంచి రూ.150 వరకు జరిమానా విధిస్తున్నారు.

Updated Date - Aug 14 , 2024 | 06:07 PM

Advertising
Advertising
<