ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గూగుల్‌ చేతికి విజ్‌ ?

ABN, Publish Date - Jul 17 , 2024 | 05:26 AM

సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ విజ్‌ను కొనుగోలు చేసేందుకు గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ చర్చలు జరుపుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ డీల్‌ విలువ 2,300 కోట్ల డాలర్లు (రూ.1.93 లక్షల కోట్లు) ఉండవచ్చని...

న్యూయార్క్‌:సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ విజ్‌ను కొనుగోలు చేసేందుకు గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ చర్చలు జరుపుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ డీల్‌ విలువ 2,300 కోట్ల డాలర్లు (రూ.1.93 లక్షల కోట్లు) ఉండవచ్చని అంచనా. ఇంటర్నెట్‌ దిగ్గజం ఆల్ఫాబెట్‌ చరిత్రలోనే ఇది అతి పెద్ద డీల్‌ కానుంది. ఎక్కువ మొత్తం నగదు రూపంలో చెల్లించే విధంగా ఈ డీల్‌ ఖరారు కావచ్చని ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు వెల్లడించాయి. ఇజ్రాయెల్‌లో ఏర్పాటై ప్రస్తుతం న్యూయార్క్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న విజ్‌ ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో ఒకటి. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా సైబర్‌ భద్రతకు సంబంధించిన ముప్పులను గుర్తించి, క్లౌడ్‌ ఆధారితంగా తక్షణ పరిష్కారాలు ఈ కంపెనీ అందిస్తుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నాయకత్వంలో టెక్నాలజీ పరిశ్రమపై నియంత్రణాపరమైన నిఘా పెరిగిన వాతావరణంలో ఆల్ఫాబెట్‌ కుదుర్చుకోబోతున్న ఈ డీల్‌ అసాధారణమైనదిగా నిలుస్తుందంటున్నారు.

Updated Date - Jul 17 , 2024 | 05:26 AM

Advertising
Advertising
<