ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కార్ల అమ్మకాలు అంతంతే..

ABN, Publish Date - Nov 02 , 2024 | 06:21 AM

ఈ ఏడాది పండగ సీజన్‌ ప్రయాణికుల వాహన కంపెనీలకు అంతగా కలిసిరాలేదు. అక్టోబరులో కార్ల టోకు విక్రయాలు అంతంత మాత్రంగానే నమోదయ్యాయి.

ఇన్వెంటరీ తగ్గించేందుకు సరఫరా కుదించిన కంపెనీలు

న్యూఢిల్లీ: ఈ ఏడాది పండగ సీజన్‌ ప్రయాణికుల వాహన కంపెనీలకు అంతగా కలిసిరాలేదు. అక్టోబరులో కార్ల టోకు విక్రయాలు అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. డీలర్ల వద్ద వాహన నిల్వలిప్పటికే భారీగా పేరుకుపోయిన నేపథ్యంలో కంపెనీలు సరఫరా తగ్గించుకోవడం ఇందుకు కారణం.

మారుతికి ఎగుమతుల దన్ను

మారుతి సుజుకీ కంపెనీ దేశీయ విక్రయాలు 1,59,591 యూనిట్లకు పరిమితమయ్యాయి. గత ఏడాదిలో ఇదే నెలకు అమ్మకాలు 1,68,047 యూనిట్లుగా ఉన్నాయి. అయితే, గతనెలలో కంపెనీ మొత్తం అమ్మకాలు (ఎగుమతులతో సహా) మాత్రం 4 శాతం పెరిగి సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయి 2,06,434 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతేకాదు, గతనెలలో కంపెనీ చరిత్రలో అత్యధిక రిటైల్‌ విక్రయాలు నమోదైనట్లు మారుతి సుజుకీ ఇండియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌) పార్థో బెనర్జీ తెలిపారు. తద్వారా తమ డీలర్ల నెట్‌వర్క్‌ వద్దనున్న వాహన నిల్వలను 40,000 యూనిట్ల మేర తగ్గించుకోగలిగామన్నారు.

హ్యుండయ్‌ మోటార్స్‌

కంపెనీ దేశీయ విక్రయాలు అతి స్వల్పంగా పెరిగి 55,568 యూనిట్లుగా నమోదయ్యాయి. ఎస్‌యూవీ మోడళ్లకు అధిక డిమాండ్‌ నెలకొందని, ఫలితంగా గత నెలలో రికార్డు స్థాయిలో 37,902 ఎస్‌యూవీల అమ్మకాలు జరిపినట్లు కంపెనీ వెల్లడించింది. దేశీయ విక్రయాల్లో ఎస్‌యూవీల వాటానే 68 శాతమని హ్యుండ య్‌ మోటార్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ తరుణ్‌ గార్గ్‌ తెలిపారు.

మహీంద్రా అండ్‌ మహీంద్రా వాహన విక్రయాలు మాత్రం 25 శాతం పెరిగి 54,504 యూనిట్లకు చేరుకున్నాయి. మొత్తం విక్రయాలు 20 శాతం వృద్ధి తో 96,648 యూనిట్లకు పెరిగాయి.

టాటా మోటార్స్‌ కార్ల దేశీయ విక్రయాలు గతనెలలో 48,131 యూనిట్లకు తగ్గాయి.

టూవీలర్‌ దిగ్గజం హీరో మోటోకార్ప్‌ విక్రయాలు అక్టోబరులో 18 శాతం పెరిగి 6,79,091కి చేరాయి. దేశీయంగా డీలర్లకు సరఫరా చేసిన వాహనాల సంఖ్య 6,57,403 కాగా ఎగుమతులు 21,688 యూనిట్లున్నాయి. ఈ కంపెనీకి చెందిన విద్యుత్‌ వాహనం విడా అమ్మకాలు కూడా బలంగానే ఉన్నాయి. అక్టోబరులో గరిష్ఠ నెలవారీ విక్రయాలు 8,750 యూనిట్లు నమోదయ్యాయి.

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎట్‌ 1,00,000 యూనిట్లు

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అమ్మకాలు తొలిసారిగా 1,00,000 యూనిట్ల మైలురాయిని దాటాయి. గ తనెలలో ఎన్‌ఫీల్డ్‌ దేశీయ విక్రయాలు 26 శాతం వృద్ధితో 1,01,886 యూనిట్లుగా నమోదయ్యాయి.

Updated Date - Nov 02 , 2024 | 06:21 AM