తెలంగాణలో విన్‌ గ్రూప్‌ స్మార్ట్‌సిటీ ప్రాజెక్ట్‌?

ABN, Publish Date - Jul 17 , 2024 | 05:24 AM

వియత్నాంకు చెందిన విన్‌ గ్రూప్‌ తెలంగాణలో స్మార్ట్‌ సిటీ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. హైదరాబాద్‌లో లేదా నగరానికి దగ్గర్లో 1,000 ఎకరాల్లో మెగా స్మార్ట్‌ సిటీని...

తెలంగాణలో విన్‌ గ్రూప్‌ స్మార్ట్‌సిటీ ప్రాజెక్ట్‌?

హైదరాబాద్‌: వియత్నాంకు చెందిన విన్‌ గ్రూప్‌ తెలంగాణలో స్మార్ట్‌ సిటీ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. హైదరాబాద్‌లో లేదా నగరానికి దగ్గర్లో 1,000 ఎకరాల్లో మెగా స్మార్ట్‌ సిటీని అభివృద్ధి చేయాలనుకుంటోంది. అనువైన స్థలం కోసం అన్వేషిస్తున్నట్లు సమాచారం. విన్‌గ్రూప్‌కు చెందిన ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ కంపెనీ విన్‌ఫాస్ట్‌ ఇప్పటికే తమిళనాడులో ఇంటిగ్రేటెడ్‌ ఈవీ ప్లాంట్‌ నిర్మాణానికి శంకుస్థాపన కూ డా చేసింది. కాగా, తెలంగాణలో స్మార్ట్‌ సిటీ అభివృద్ధితోపాటు ఈవీ విడిభాగాలను సైతం తయారు చేయాలనుకుంటోంది. ఇందుకోసం విన్‌ఫాస్ట్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ గతవారం తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డీ శ్రీధర్‌ బాబును కలిసినట్లు తెలిసింది.

Updated Date - Jul 17 , 2024 | 05:24 AM

Advertising
Advertising
<