ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విప్రో లాభం రూ.3,003 కోట్లు

ABN, Publish Date - Jul 20 , 2024 | 05:45 AM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024 -25)లో జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికానికి (క్యూ1) విప్రో ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 4.6 శాతం వృద్ధితో రూ.3,003.2 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఇదే కాలానికి కంపెనీ లాభం రూ.2,870 కోట్లుగా

ఆదాయం రూ.21,963 కోట్లు

ఈసారి 12,000 నియామకాలు

బెంగళూరు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024 -25)లో జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికానికి (క్యూ1) విప్రో ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 4.6 శాతం వృద్ధితో రూ.3,003.2 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఇదే కాలానికి కంపెనీ లాభం రూ.2,870 కోట్లుగా నమోదైంది. కాగా, ఈ క్యూ1లో విప్రో ఆదాయం వార్షిక ప్రాతిపదికన 3.8 శాతం తగ్గి రూ.21,963.8 కోట్లకు పరిమితమైంది. 2023-24లో ఇదే సమయానికి రాబడి రూ.22,831 కోట్లుగా నమోదైంది. క్యూ1లో ఐటీ సేవల ద్వారా కంపెనీకి 262.59 కోట్ల డాలర్ల ఆదాయం సమకూరింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబరుతో ముగియనున్న రెండో త్రైమాసికం (క్యూ2)లో ఐటీ సేవల ద్వారా ఆదాయం 260-265.2 కోట్ల డాలర్ల శ్రేణిలో నమోదు కావచ్చని విప్రో అంచనా వేసింది. అంటే, త్రైమాసిక ప్రాతిపదికన (క్యూ1తో పోలిస్తే) ఆదాయ వృద్ధి మైనస్‌ 1 శాతం నుంచి ప్లస్‌ ఒక శాతం శ్రేణిలో ఉండవచ్చని కంపెనీ భావిస్తోంది. మరిన్ని వివరాలు..

  • గడిచిన మూడు నెలల్లో 120 కోట్ల డాలర్ల విలువైన బడా కాంట్రాక్టులను దక్కించుకున్నట్లు విప్రో వెల్లడించింది. ఏడాది క్రితం ఇదే సమయంలో దక్కిన డీల్స్‌ విలువతో పోలిస్తే మాత్రం 3.6 శాతం తగ్గింది.

  • క్యూ1లో విప్రో ఉద్యోగుల సంఖ్య నికరంగా 337 పెరుగుదలతో 2,34,391కి చేరుకుంది. దాంతో వరుసగా ఆరు త్రైమాసికాలుగా సిబ్బంది సంఖ్య తగ్గుదలకు అడ్డుకట్టపడింది. కాగా, క్యూ1లో కంపెనీ ఉద్యోగుల వలసల (అట్రిషన్‌) రేటు 14.1 శాతానికి తగ్గింది. అంతక్రితం త్రైమాసికంలో అట్రిషన్‌ రేటు 14.2 శాతంగా నమోదైంది.

  • గడిచిన మూడు నెలల్లో ప్రాంగణ నియామకాల ద్వారా దాదాపు 3,000 మంది ఫ్రెషర్లను ఉద్యోగాల్లో చేర్చుకున్నట్లు విప్రో చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ ఆఫీసర్‌ (సీహెచ్‌ఆర్‌ఓ) సౌరభ్‌ గోవిల్‌ తెలిపారు. మున్ముందూ ప్రాంగణ నియామకాలతో పాటు ఆఫ్‌-క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ సైతం జరపనున్నట్లు.. ఆర్థిక సంవత్సరం మొత్తానికి 10,000 నుంచి 12,000 నియమించుకోనున్నట్లు ఆయన చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే స్థాయిలో నియమాకాలు చేపట్టే అవకాశం ఉందని గోవిల్‌ సంకేతాలిచ్చారు.

Updated Date - Jul 20 , 2024 | 05:45 AM

Advertising
Advertising
<