Zee Entertainment: జీ-సోనీ మధ్య ఏకాభిప్రాయం.. భారీగా పెరిగిన జీ ఎంటర్‌టైన్మెంట్ స్టాక్..!
ABN, Publish Date - Aug 27 , 2024 | 04:27 PM
జీ ఎంటర్‌టైన్మెంట్, సోనీ పిక్చర్స్ మధ్య విలీన ఒప్పందం రద్దైన నేపథ్యంలో నెలకొన్న విభేదాలను సామరస్యం పరిష్కరించుకునేందుకు ఇరు సంస్థలూ అంగీకారానికి వచ్చాయి. జీ ఎంటర్‌టైన్మెంట్, సోనీ పిక్చర్స్ విలీన ప్రక్రియ క్యాన్సిల్ కావడంతో ఇరు సంస్థలూ పరస్పరం కేసులు పెట్టుకున్నాయి.
జీ ఎంటర్‌టైన్మెంట్ (Zee Entertainment), సోనీ పిక్చర్స్ (Sony Pictures Networks) మధ్య విలీన ఒప్పందం రద్దైన నేపథ్యంలో నెలకొన్న విభేదాలను సామరస్యం పరిష్కరించుకునేందుకు ఇరు సంస్థలూ అంగీకారానికి వచ్చాయి. జీ ఎంటర్‌టైన్మెంట్, సోనీ పిక్చర్స్ విలీన ప్రక్రియ క్యాన్సిల్ కావడంతో ఇరు సంస్థలూ పరస్పరం కేసులు పెట్టుకున్నాయి. ఆ కేసులను తాజాగా ఇరు సంస్థలూ సామరస్యంగా పరిష్కరించుకున్నాయి (Zee-Sony Deal). ఒకరిపై మరొకరు పెట్టుకున్న కేసులను ఉపసంహరించకున్నాయి. దీంతో ఆ వివాదం సద్దుమణిగింది. ఈ మేరకు ఇరు సంస్థలు సంయుక్తంగా ఓ ప్రకటనను విడుదల చేశాయి (Business News).
విలీన ప్రక్రియ రద్దైన తర్వాత ఇరు సంస్థలు సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్‌తో పాటు, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్, ఇతర న్యాయ వేదికల మీద పరస్పరం కేసులు పెట్టుకున్నాయి. నష్టపరిహారం కోసం న్యాయ పోరాటాలు చేయాలని రంగంలోకి దిగాయి. అయితే ఆ కేసులకు ముగింపు పలికి, ఎవరికి వారు స్వంతంగా మీడియా, ఎంటర్‌టైన్మెంట్ రంగాల్లో ఎదగాలని నిర్ణయానికి వచ్చాయి. జీ ఎంటర్‌టైన్మెంట్‌తో సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ ఇండియా (ప్రస్తుతం కల్వర్ మ్యాక్స్ ఎంటర్‌టైన్మెంట్) 10 బిలియన్ డాలర్లు (రూ.83 వేల కోట్లు) విలీన ఒప్పందం కుదుర్చుకుంది.
ఆ విలీన ప్రక్రియకు అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. పలు బ్యాంక్‌లు, ఇతర సబ్సిడీ కంపెనీలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. పెట్టుకున్న గడువు లోపు విలీన ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఆ ఒప్పందం నుంచి సోనీ గ్రూప్ కార్పొరేషన్ వైదొలగింది. అప్పట్నుంచి ఇరు సంస్థలు న్యాయ పోరటాలకు దిగాయి. వాటిని ఇరు సంస్థలు సామరస్యంగా పరిష్కరించుకోవడంతో వివాదం సమసిపోయింది. దీంతో ఈ రోజు జీ ఎంటర్‌టైన్మెంట్ సంస్థ షేర్లు ఒక దశలో ఏకంగా 14 శాతం పెరిగాయి. చివరకు 11.56 శాతం లాభంతో రోజును ముగించాయి.
ఇవి కూడా చదవండి..
Stock Market: ఆరంభ లాభాలు ఆవిరి.. ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ సూచీలు..!
YouTube: యూజర్లకు షాకిచ్చిన యూట్యూబ్.. ఈ ప్లాన్‌ల ధరలు పెంపు
Business Idea: రూ. 15 వేల పెట్టుబడితో వ్యాపారం .. నెలకు రూ.50 వేలకుపైగా ఆదాయం
Bank Holidays: సెప్టెంబర్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్నంటే.. గణేష్ చతుర్థి సహా.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Aug 27 , 2024 | 04:27 PM