Accident: మినీ బస్సు, ట్రక్కు ఢీ.. 12 మంది స్కూల్ విద్యార్థులు మృతి
ABN, Publish Date - Jul 11 , 2024 | 07:12 AM
ఇటివల అనేక చోట్ల పాఠశాలలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఆ క్రమంలోనే స్కూల్ పిల్లలను పాఠశాలకు తీసుకెళ్తున్న వ్యాన్లు, బస్సుల విషయంలో మాత్రం పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ వాహనాలు అనేక చోట్ల ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విద్యార్థులను తీసుకెళ్తున్న ఓ మినీ బస్సును పికప్ ట్రక్ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది(accident). దీంతో అందులో ఉన్న స్కూల్ విద్యార్థుల్లో 12 మంది, డ్రైవర్ కూడా మృత్యువాత చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు.
ఇటివల అనేక చోట్ల పాఠశాలలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఆ క్రమంలోనే స్కూల్ పిల్లలను పాఠశాలకు తీసుకెళ్తున్న వ్యాన్లు, బస్సుల విషయంలో మాత్రం పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ వాహనాలు అనేక చోట్ల ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విద్యార్థులను తీసుకెళ్తున్న ఓ మినీ బస్సును పికప్ ట్రక్ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది(accident). ఆ క్రమంలో బస్సు బోల్తా పడి మంటలు అంటుకుని దగ్ధమైంది. దీంతో అందులో ఉన్న స్కూల్ విద్యార్థుల్లో 12 మంది, డ్రైవర్ కూడా మృత్యువాత చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ విషాద ఘటన దక్షిణాఫ్రికా(South Africa) గౌటెంగ్ ప్రావిన్స్(Gauteng province)లోని మెరాఫాంగ్ మునిసిపాలిటీలో చోటుచేసుకుంది.
చనిపోయిన వారిలో 11 మంది రాక్‌లాండ్స్ ప్రైమరీ స్కూల్‌కు(school) చెందిన వారని, ఒకరు కార్ల్‌టన్‌విల్లేలోని లీర్‌స్కూల్ బ్లీవ్‌రూట్‌సిగ్‌కు చెందిన వారని అక్కడి మీడియా తెలిపింది. ఈ విషాద ఘటనపై అక్కడి నేతలు సంతాపం వ్యక్తం చేస్తూ పిల్లల మరణాలు సమాజానికి తీరని లోటని అన్నారు. ఆ క్రమంలో మరణించిన, గాయపడిన విద్యార్థుల కుటుంబాలకు అండగా ఉంటామని వెల్లడించారు.
ఇటివల రెండు రోజుల క్రితం హర్యానాలోని పంచకుల, పింజోర్ సమీపంలో బస్సు బోల్తా(bus accident) పడడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 40 మందికి పైగా పాఠశాల విద్యార్థులు గాయపడ్డారు. క్షతగాత్రులను పింజోర్, పంచకులలోని ఆసుపత్రుల్లో చేర్పించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళను చండీగఢ్‌లోని పీజీఐకి తరలించారు. బస్సు అతివేగంతో వెళ్లడం వల్లే ప్రమాదం జరిగిందని ఆస్పత్రిలో చేరిన గాయపడిన విద్యార్థులు తెలిపారు. రోజురోజుకు ఇలాంటి ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో స్కూల్ పిల్లల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి.
ఇది కూడా చదవండి:
Accident: పాల ట్యాంకర్‌ను ఢీకొట్టిన బస్సు.. 18 మంది మృతి, 30 మందికి గాయాలు
Maharashtra: బయటకు తీసుకెళ్లని భర్త.. కోపంతో భార్య ఏం చేసిందంటే?
National : నకిలీ కంపెనీలు.. బలవంతపు చాకిరీ!
Read Latest Crime News and Telugu News
Updated Date - Jul 11 , 2024 | 07:13 AM