Suchana Seth Case: సుచనా సేథ్ కేసులో కీలక విషయాలు చెప్పిన ట్యాక్సీ డ్రైవర్..
ABN, Publish Date - Jan 12 , 2024 | 02:14 PM
గోవా(goa)లో ఇటివల నాలుగేళ్ల చిన్నారిని దారుణంగా హత్య చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న బెంగుళూరులోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ సీఈవో సుచనా సేథ్ కేసులో రోజురోజుకు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ క్రమంలో ట్యాక్సీ డ్రైవర్ రే జాన్ మహిళను ఎలా పట్టించారో అనే విషయాలను వెల్లడించారు.
గోవాలో ఇటివల నాలుగేళ్ల చిన్నారిని దారుణంగా హత్య చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న బెంగుళూరులోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ సీఈవో సుచనా సేథ్(suchana seth) కేసులో రోజురోజుకు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ కేసులో ట్యాక్సీ డ్రైవర్ సహాయంతో గోవా పోలీసులు నిందితురాలిని పట్టుకున్నారు. ఆ క్రమంలో ట్యాక్సీ డ్రైవర్ రే జాన్(re jan) మహిళను ఎలా పట్టించారనే విషయాలను వెల్లడించారు. సుచనా సేథ్ మొదట ట్యాక్సీని బుక్ చేయగా డ్రైవర్ సర్వీస్ అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నట్లు తెలిపారు. ఆ క్రమంలో ఆమె రిసెప్షన్ నుంచి తన బ్యాగ్‌ను కారులో పెట్టమని చెప్పింది. కానీ అది చాలా బరువుగా ఉందని జాన్ చెప్పగా.. బ్యాగ్ తేలికగా చేయడానికి బ్యాగ్‌లోని కొన్ని వస్తువులను తీసివేయగలరా అని ఆమెను కోరగా ఆ మహిళ అందుకు నిరాకరించిందని డ్రైవర్ అన్నారు. ఆ తర్వాత బెంగళూరు వైపు వెళ్లినట్లు డ్రైవర్ జాన్ చెప్పాడు. ఆ రోజు కర్ణాటక గోవా సరిహద్దులోని కోర్లా ఘాట్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ ఉన్న పోలీసులు జామ్ క్లియర్ చేయడానికి కనీసం నాలుగు గంటలు పడుతుందని చెప్పారు.
కానీ ట్రాఫిక్ క్లియర్ కావడానికి ఆరు గంటల సమయం పడుతుందని చెప్పినట్లు డ్రైవర్(driver) వెల్లడించారు. ఆ క్రమంలో వెనక్కి వెళ్లి ఆమెను విమానాశ్రయంలో డ్రాప్ చేయాలా అని సలహా ఇస్తే ఆమె రోడ్డు ద్వారా మాత్రమే వెళ్లాలని పట్టుబట్టింది. అప్పుడే ఏదో తప్పు జరిగిందని తాను గ్రహించినట్లు జాన్ అన్నాడు. ఆ సమయంలోనే తనకు పోలీసుల నుంచి కాల్ వచ్చిందని తెలిపాడు. అతనితో ప్రయాణిస్తున్న మహిళ అనుమానాస్పదంగా ఉందని పోలీసులు చెప్పారు. ఆ క్రమంలో పోలీసులు దగ్గరలోని పోలీస్ స్టేషన్‌ని గుర్తించి అక్కడికి ఆ మహిళను తీసుకురావాలని చెప్పారు. ఆ తర్వాత నిజమేనని భావించిన తాను Google Map, GPS ద్వారా సమీపంలోని పోలీస్ స్టేషన్ కోసం వెతికానని వెల్లడించారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ చూడండి: Hyderabad: వీడియో కాల్ చేసి ప్రాధేయపడినా.. ఇంటికి రాని భర్త.. భార్య ఆత్మహత్య
ఆ నేపథ్యంలోనే కారును ఈయమంగళ పోలీస్ స్టేషన్ (కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఉంది)కి తీసుకెళ్లినట్లు డ్రైవర్ చెప్పారు. ఈ మొత్తం సమయంలో గోవా(goa) పోలీసు అధికారులు దారిలో తనతో కాల్‌లో ఉన్నారని తెలిపారు. పోలీసులు వచ్చేసరికి ఆమె పూర్తిగా ప్రశాంతంగా కారులో హాయిగా కూర్చున్నారని డ్రైవర్ చెప్పాడు. కానీ పోలీసులు బ్యాగ్‌ని పరిశీలించగా అందులో చిన్నారి మృతదేహం కనిపించింది. దీంతో నిందితురాలిని గోవా పోలీసులు అరెస్టు చేసి మంగళవారం గోవాకు తీసుకొచ్చి గురువారం మపుసా కోర్టులో హాజరుపరిచారు. నిందితురాలిని కోర్టు ఆరు రోజుల పోలీసు రిమాండ్‌కు పంపింది.
Updated Date - Jan 12 , 2024 | 02:23 PM