Viral News: భార్యపై కోపం.. ఆ భర్త తన పిల్లలతో కలిసి ఏం చేశాడో తెలిస్తే కన్నీళ్లు రాక మానవు..
ABN, Publish Date - Nov 01 , 2024 | 07:40 PM
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలోని జాత్పుర గ్రామానికి చెందిన పునీత్ అనే వ్యక్తి క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతడికి వివాహం జరిగి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఏడాది కాలంగా భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది.
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. భార్య (Wife) మీద కోపంతో ఓ వ్యక్తి దారుణ నిర్ణయం తీసుకున్నాడు. తన ఇద్దరు పిల్లలకు విషం (Poison) ఇచ్చి తను కూడా తాగేశాడు. దీంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలోని జాత్పుర గ్రామానికి చెందిన పునీత్ అనే వ్యక్తి క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతడికి వివాహం జరిగి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఏడాది కాలంగా భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది (Crime News).
పునీత్ భార్య ఆరు నెలలుగా పుట్టింట్లోనే ఉంటుంది. ఇద్దరు పిల్లలను కూడా పునీత్ దగ్గరే వదిలేసింది. పునీత్ ఎంత బ్రతిమిలాడినా తిరిగి రాలేదు. దీపావళి రోజున పునీత్ తన పిల్లలను తీసుకుని భార్య దగ్గరకు వెళ్లి మళ్లీ అడిగాడు. అయినా సరే అత్తింటికి వచ్చేందుకు పునీత్ భార్య అంగీకరించలేదు. దీంతో పునీత్ దారుణ నిర్ణయం తీసుకున్నాడు. అత్తింటి వెలుపల ఉంచిన కారులోకి ఎక్కి తన ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చాడు. అనంతరం తాను తాగేశాడు. చుట్టు పక్కల వారు వెంటనే గుర్తించి హాస్పిటల్‌కు తరలించేందుకు ప్రయత్నించారు.
మార్గ మధ్యంలోనే పునీత్, అతడి పెద్ద కొడుకు చనిపోయారు. చిన్న కొడుకు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. చనిపోయే ముందు పునీత్ ఓ వీడియో రికార్డు చేశాడు. తమ మరణాలకు తన భార్యే కారణం అని, ఆమెకు ఉరిశిక్ష విధించాలని ఆ వీడియోలో పేర్కొన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం దర్యాఫ్తు సాగిస్తున్నారు.
మరిన్ని నేర వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Nov 01 , 2024 | 07:40 PM