ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: షాకింగ్ వీడియో.. రాంగ్ రూట్‌లో వచ్చి ఢీకొన్న కార్.. స్పాట్‌లో మరణించిన బైకర్..

ABN, Publish Date - Sep 20 , 2024 | 10:39 AM

గతం వారం గురుగ్రామ్‌లో జరిగిన భయంకర యాక్సిడెంట్‌కు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆదివారం రాత్రి గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్‌ రోడ్డులో ఓ 23 ఏళ్ల బైకర్ వేగంగా వెళ్తున్నాడు. అయితే అదే సమయంలో మహీంద్రా ఎస్‌యూవీ కారు రాంగ్ రూట్‌లో వస్తోంది.

Gurugram accident

గతం వారం గురుగ్రామ్‌లో (Gurugram) జరిగిన భయంకర యాక్సిడెంట్‌కు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (Gurugram accident). ఆదివారం రాత్రి గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్‌ రోడ్డులో ఓ 23 ఏళ్ల బైకర్ (Biker) వేగంగా వెళ్తున్నాడు. అయితే అదే సమయంలో మహీంద్రా ఎస్‌యూవీ (Mahindra SUV) కారు రాంగ్ రూట్‌లో వస్తోంది. ఆ కారును ఢీకొన్న బైకర్ అక్కడికక్కడే మరణించాడు. ఆ యాక్సిడెంట్‌కు సంబంధించిన దృశ్యాలు మృతుడి స్నేహితుడు మొబైల్‌లో చిత్రీకరించాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


గురుగ్రామ్‌కు చెందిన ఆకాశ్ గార్గ్, అతడి స్నేహితుడు వేర్వేరు బైక్‌ల మీద ఆంబియన్స్ మాల్ వైపు వెళ్తున్నారు. ఆకాశ్ హెల్మెట్, సేఫ్టీ గ్లౌస్‌లు వేసుకున్నాడు. గోల్ప్ కోర్సు రోడ్డులో ఆకాశ్ కుడి వైపు తిరుగుతుండగా అటు వైపు ఓ మహీంద్రా ఎస్‌యూవీ రాంగ్ రూట్‌లో వచ్చింది. దాంతో ఆ కార్‌, బైక్ భీకరంగా ఢీకొన్నాయి. ఆకాశ్ ఎగిరి డివైడర్‌పై పడ్డాడు. ఆకాశ్‌కు 100 మీటర్ల వెనుకగా అతడి స్నేహితుడు వస్తున్నాడు. యాక్సిడెంట్ జరిగిన వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని ఆంబులెన్స్ రప్పించి ఆకాశ్‌ను హాస్పిటల్‌కు పంపించారు. అయితే ఆకాశ్ మార్గమధ్యంలోనే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.


రాంగ్ రూట్‌లో వచ్చిన మహీంద్రా ఎస్‌యూవీ ఓనర్ కుల్‌దీప్ కుమార్ ఠాకూర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు పలు రాజకీయ పార్టీల కోసం సోషల్ మీడియాలో ఎలక్షన్ క్యాంపెయిన్ రన్ చేస్తుంటాడు. కాగా, అరెస్ట్ అయిన రెండ్రోజులకే కుల్‌దీప్ బెయిల్‌పై బయటకు వచ్చాడు. గూగుల్ మ్యాప్ ఆధారంగానే తాను ఆ రూట్‌లో వెళ్తున్నానని కుల్‌దీప్ చెప్పడం గమనార్హం. కాగా, కుల్‌దీప్‌పై, గురుగ్రామ్ పోలీసులపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇవి కూడా చదవండి..

Optical Illusion: మీ అబ్జర్వేషన్ స్కిల్స్‌కు టెస్ట్.. ఈ ఫొటోలో ఉన్న వారిలో ఓ రోబో ఉంది.. కనిపెట్టండి..


Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. నీటిలోనే మొసలికి కళ్లు బైర్లు కమ్మే షాకిచ్చిన జాగ్వార్.. వీడియో వైరల్..


Viral Video: క్లాస్‌లో గొడవ జరుగుతోందని పరుగులు పెట్టిన టీచర్.. లోపలికి వెళ్లాక ఏం జరిగిందో చూస్తే..


Viral Video: ఈ కుర్రాడి ప్రతిభ చూస్తే నివ్వెరపోవాల్సిందే.. 25 కోట్ల మంది ఈ వీడియోను ఎందుకు చూశారంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 20 , 2024 | 10:39 AM