ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జల్సాలకు అలవాటు పడి చోరీలు

ABN, Publish Date - Nov 14 , 2024 | 12:41 AM

పెద్దఅడిశర్లపల్లి,నవంబరు 13(ఆంధ్రజ్యోతి): జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరి నిందితులను గుడిపల్లి పోలీసులు రిమాం డ్‌కు తరలించారు.

పెద్దఅడిశర్లపల్లి,నవంబరు 13(ఆంధ్రజ్యోతి): జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరి నిందితులను గుడిపల్లి పోలీసులు రిమాం డ్‌కు తరలించారు. దేవరకొండ డీఎస్పీ గిరిబాబు గుడిపల్లి పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంగడిపేట గ్రామానికి చెందిన తంగిరాల గంగాధరచారి(30) ఎలకా్ట్రనిక్‌, వడ్రంగి పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతడి స్నేహితుడు త్రిపురారం మండలం, సత్యనారాయణపురం గ్రామానికి చెందిన మోట మారి ఆంజనేయులు(25)తో సులభంగా డబ్బులు సంపాదించాలని దొంగత నాలకు పాల్పడుతున్నారు. గతేడాది పీఏపల్లిలో వంగాల లక్ష్మారెడ్డి ఇంట్లో చోరీ చేసి 4 తులాల ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ నెల 6న అంగడిపేట ఎక్స్‌రోడ్డులో రాజు ఇంట్లో రూ.92 వేలు చోరీకి గురి కావడంతో పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదులు చేశారు. వరుస దొంగతనాలు జరుగుతు ండడంతో సీరియస్‌గా తీసుకున్న కొండమల్లేపల్లి సీఐ ధనంజయ్‌, గుడిపల్లి ఎస్‌ఐ నర్సింహులు సీసీ ఫుటేజీలు వేలిముద్రల ఆధారంగా పాత నేరస్తుడైన అంగడిపేట ఎక్స్‌రోడ్డు చెందిన గంగాధరచారి అని గుర్తించారు. అతడిని అదుపులో తీసుకొని విచా రించగా ఆంజనేయులుతో కలిసి చోరి చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుల నుంచి ఎర్టీగా కారు, ఆభరణాలు, కూలర్‌ మోటర్లు, సెల్‌ఫోన్లు మొత్తం కలిపి రూ. 6 లక్షల విలువైన వస్తువులను రికవరీ చేశామని డీఎస్పీ తెలి పారు. కేసును తొందరగా చేధించినందకు సీఐ ధనుంజయ్‌, ఎస్‌ఐ నర్సిం హులు, క్రెంౖ టీం శ్రీధర్‌రెడ్డి, హేమానాయక్‌, హట్టీనాయక్‌, భాస్కర్‌, గురువా రెడ్డి, రవికుమార్‌ను ఎస్పీ రివార్డు ప్రకటించినట్లు డీఎస్పీ తెలిపారు.

Updated Date - Nov 14 , 2024 | 12:41 AM