ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: అబ్బో.. ఈ యువకుడి పైత్యం మామూలుగా లేదుగా.. నాకే చలానా రాస్తావా.. నీ అంతు చూస్తా అంటూ..

ABN, Publish Date - Feb 20 , 2024 | 01:12 PM

విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ ఎస్సై(Traffic SI)ని దుర్భాషలాడి బెదిరించిన యువకుడిపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

- ట్రాఫిక్‌ ఎస్సైని బెదిరించిన యువకుడు

- కేసు నమోదు

బంజారాహిల్స్‌(హైదరాబాద్): విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ ఎస్సై(Traffic SI)ని దుర్భాషలాడి బెదిరించిన యువకుడిపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్‌ఆర్‌నగర్‌ ట్రాఫిక్‌ ఎస్సై నరేష్‌ ఆధ్వర్యంలో సిబ్బంది యూసుఫ్ గూడ సమీపంలో వాహనానలు తనిఖీ చేస్తున్నారు. ఇందిరానగర్‌కు చెందిన రమావత్‌ అంజనేయులు(30) తన బైక్‌పై హెల్మెట్‌ లేకుండా వెళ్తుండడంతో ట్రాఫిక్‌ పోలీసులు ఆపారు. చలానా వేయటంతోపాటు నాలుగు పెండింగ్‌ చలానాలు ఉన్నాయని, చెల్లించాలని ఎస్సై నరేష్‌ సూచించారు. దీంతో ఆంజనేయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎస్సైతో వాగ్వాదానికి దిగాడు. ‘నాకు చలానా వేస్తే నీ అంతు చూస్తా.. మీడియాను పిలిచి

నీ ఉద్యోగం ఊడగొడతా.. నా గురించి పంజాగుట్ట పీఎస్‏లో తెలుసుకోండి’ అంటూ దుర్భాషలాడాడు. అంతటితో ఆగకుండా చలానా వేస్తే నాబైక్‌పై పెట్రోల్‌పోసి కాల్చేస్తానని బెదిరించాడు. ట్రాఫిక్‌ ఎస్సై ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Feb 20 , 2024 | 01:12 PM

Advertising
Advertising