ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కుమారుడిని చంపి.. తల్లి ఆత్మహత్య

ABN, Publish Date - Oct 08 , 2024 | 12:05 AM

భూదాన్‌పోచంపల్లి, అక్టోబరు 7: మానసికస్థితి సరిగా లేని ఓ తల్లి కుమారుడిని చంపి, తానూ ఆత్యహత్య చేసుకుంది. సోమవారం యాదాద్రిభువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం పెద్దరావులపల్లి గ్రామంలో ఈ సంఘటన జరిగింది.

యాదాద్రి-భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం పెద్దరావులపల్లి గ్రామంలో కొడుకు రేయాన్షను చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి సోని (ఫైల్‌)

భూదాన్‌పోచంపల్లి, అక్టోబరు 7: మానసికస్థితి సరిగా లేని ఓ తల్లి కుమారుడిని చంపి, తానూ ఆత్యహత్య చేసుకుంది. సోమవారం యాదాద్రిభువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం పెద్దరావులపల్లి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఎస్‌ఐ కె.భాస్కర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జడల రాజు యాదవ్‌కు అదే గ్రామానికి సోని(29)తో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. రాజు స్టేజీ డెకరేషన్‌ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కొంత కాలంగా సోని అనారోగ్యంతో బాధపడుతోంది. మానసిక రుగ్మతతో (తనకు భయం వేస్తోందని, బుగులుగా ఉంటోందని వెళ్లేది) తరుచూ తల్లిగారింటికి వెళ్తుండేది. మూడు రోజుల క్రితం తల్లిగారింటికి వెళ్లి ఆదివారం వచ్చింది. సోమవారం ఉదయం భర్త రాజు పనిపై బయటకు వెళ్లాడు. అత్తామామలు కూడా పని నిమిత్తం బయటికి వెళ్లారు. ఇంట్లో సోని తన ఇద్దరు కుమారులు చింటు(7), రేయాన్స్‌(5)తో ఉంది. పని ముగించుకుని సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన రాజుకు గదిలో రేయాన్ష్‌ అచేతనంగా పడి ఉండడాన్ని కిటికీలోనుంచి గమనించాడు. ఫ్యాన్‌కు సోని వేలాడుతుండడాన్ని చూసి ఇరుగుపొరుగు సహాయంతో ఇద్దరినీ భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారిద్దరూ మృతిచెందారని డాక్టర్లు నిర్థారించారు. పెద్ద కుమారుడు చింటును స్నేహితులతో ఆడుకోవాలని చెప్పి బయటికి పంపటంతో తల్లి, రేయాన్స్‌లు ఇద్దరే ఇంటి వద్ద ఉన్నారు. గదిలోకి వెళ్లి తలుపునకు గడియ పెట్టిన అనంతరం రేయాన్ష్‌ను గొంతు నులిమి చంపి, ఆ తర్వాత ఆమె కూడా ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నట్లు కుటుంబసభ్యులు గుర్తించారు. మృతదేహాలను భువనగిరి ఏరియా పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రి మార్చురీలో ఉంచారని ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. సోని, రాజు దంపతులు అన్యోన్యంగా ఉండేవారని, ఎలాంటి గొడవలు లేకుండా ఉన్నారని స్థానికులు తెలిపారు. తరుచూ తనకు భయంవేస్తోందని అక్కడక్కడా చూపించుకొనేదని వారు తెలిపారు.

Updated Date - Oct 08 , 2024 | 12:13 AM