ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Crime: అసలు వీళ్లు మనుషులేనా.. మూఢనమ్మకంతో ఐదేళ్ల బాలుడిని మట్టుబెట్టారు..

ABN, Publish Date - Jan 25 , 2024 | 02:07 PM

మనిషికి నమ్మకం ఎంతో బలమైంది. చేయగలననే నమ్మకం ఉంటే చాలు.. ఏదైనా సాధించేస్తాననే భరోసా ఇస్తుంది. కానీ.. అదే నమ్మకం మితిమీరిపోతే..

మనిషికి నమ్మకం ఎంతో బలమైంది. చేయగలననే నమ్మకం ఉంటే చాలు.. ఏదైనా సాధించేస్తాననే భరోసా ఇస్తుంది. కానీ.. అదే నమ్మకం మితిమీరిపోతే.. మూఢ నమ్మకంగా మారితే.. ఈ అంధ విశ్వాసం ఓ ఐదేళ్ల చిన్నారి నిండు ప్రాణాన్ని బలి కోరుకుంటే.. అమ్మో.. ఊహిస్తేనే భయంకరంగా ఉంది కదా.. కానీ అలాంటి ఘటనే హరిద్వార్ లో జరిగింది. దిల్లీకి చెందిన ఐదేళ్ల బాలుడు బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ఆస్పత్రుల్లో చూపించినా ఫలితం లేదు. చివరగా సర్ గంగారామ్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ బాలుడిని పరీక్షించిన వైద్యులు తాము ఏమీ చేయలేమని చెప్పారు. తీవ్ర శోకంలో మునిగిపోయిన ఆ కుటుంబసభ్యులు ఏదైనా మిరాకిల్ జరగకపోతుందా అని ఆలోచించారు. ఆ క్రమంలోనే వారికి ఓ ఐడియా వచ్చింది. చిన్నారిని గంగానదిలో ముంచితే వ్యాధి నయమవుతుందని భావించారు. అనుకున్నట్లే కుటుంబమంతా హరిద్వార్‌లోని గంగా నది వద్దకు చేరుకున్నారు.

ఓ మహిళ చిన్నారిని ఎత్తుకుని గంగా నదిలో ముంచింది. ఎంత సేపయినా బయటకు తీయకపోవడంతో చుట్టుపక్కల ఉన్నవారికి అనుమానం వచ్చింది. అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారితో ఆ మహిళ వాగ్వాదానికి దిగింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారిని జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 25 , 2024 | 03:05 PM

Advertising
Advertising