Home » Ganga
Mahakumbh Mela 2025: మహా కుంభమేళాలో రేపు (ఫిబ్రవరి 12) మాఘ పూర్ణిమ రాజస్నానం. ఈ సందర్భంగా ప్రయాగ్‌రాజ్ చుట్టు పట్ల రెండు రోజుల ముందు నుంచే దాదాపు 300 కి.మీ. మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకుని జనసమూహ నియంత్రణకు.. రేపటి నుంచి మహా కుంభమేళాలో ఈ సమయాల్లో నో వెహికల్ జోన్ రూల్ అమల్లోకి రానుంది.
మీరు ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్తున్నారా.. పనిలో పనిగా వారణాసిని కూడా దర్శించుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారా.. అయితే మీరు తప్పనిసరిగా ఇలా చేయండి. క్యూలైన్‌లో గంటల తరబడి వేచి చూడాల్సిన పని లేకుండా కాశీ విశ్వనాథుని ప్రశాంతంగా కనులారా వీక్షించే అవకాశం పొందవచ్చు.. అదెలాగో ఈ కథనంలో తెలుసుకుందాం..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు దేశవిదేశాల నుంచి భక్తులు వస్తున్నారు. హిందూ మతంలోని గొప్పతనం ఇదే అని అంతా ప్రశంసిస్తున్నారు. ఇది నాణేనికి ఒకవైపే. పవిత్ర స్నానాల కోసం ఇంత దూరం వచ్చి కొందరు త్రివేణి సంగమం ఒడ్డున చేస్తున్న పనులు చూస్తే ఎవరైనా ఛీ ఛీ అనక మానరు. అమృత స్నానాలు చేసే చోట కొందరు భక్తులు చేస్తున్న అసహ్యకరమైన పనులు ఇవి..
భగవంతుడిని ప్రతి ఒక్కరూ నమ్మతారని, ప్రజలు ప్రతిరోజూ ఇళ్లలో పూజలు చేస్తామని, ఇంట్లో పూజ పూర్తయిన తర్వాతే మహిళలు బయటకు వెళ్తుంటారని ఖర్గే అన్నారు. అయితే మతం పేరుతో పేద ప్రజల వంచన కూడదని, ఇలాంటి వారి వల్ల దేశానికి ఎలాంటి ప్రయోజనం చేకూరదని బీజేపీని విమర్శించారు.
ఉత్తర్ ప్రదేశ్: ప్రయాగ్ రాజ్‌లో మహాకుంభమేళ అంగరంగ వైభవంగా సాగుతోంది. కోట్ల మంది భక్తులు ప్రయాగ్ రాజ్‌కు చేరుకుని గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. 45 రోజులపాటు సాగే మహాకుంభమేళాకు ఇప్పటికే దేశవిదేశాల నుంచి కోట్ల మంది భక్తులు వచ్చి గంగాదేవి, శివయ్యను భక్తిశ్రద్ధలతో పూజించారు.
మహాకుంభోత్సవం పాల్గొనడం భగవంతుడు తనకు ఇచ్చిన అవకాశం భావిస్తున్నట్టు రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఆయన వెంట బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది, పలువురుపార్టీ నేతలు మహాకుంభ్‌లో పాల్గొన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో సంగం నది ఒడ్డున నిర్వహించబడుతున్న మహా కుంభమేళాలో ఈరోజు మూడవ రోజు. ఇప్పటి వరకూ 5.5 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు..
ఒక సాధువు 32 ఏళ్లుగా స్నానం చేయలేదు.. మరొకరు 14 ఏళ్లుగా కుడిచేయి పైకి ఎత్తే ఉంచారు.. ఇంకొకరు 45 కిలోల రుద్రాక్ష తలపాగాతో కనిపిస్తారు. ఈ విచిత్ర సాధువులంతా మహా కుంభమేళాకు హాజరై భక్తుల దృష్టిని ఆకర్షిస్తున్నారు..
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం 'మహా కుంభ్' ఈరోజు సోమవారం పుష్య పూర్ణిమతో ప్రారంభమైంది. 144 ఏళ్ల తర్వాత ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ఈ మహా కుంభంలో పాల్గొనేందుకు భారతీయులే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తొలి రోజే అమృత స్నానంలో పాల్గొనడం అద్భుత అనుభూతిని కలిగించిందని పలువురు విదేశీయులు అంటున్నారు..
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా పుష్యపౌర్ణమి రోజున(జనవరి 13వ తేదీ) ఘనంగా ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు, నాగసాధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వీరందరిలోకి భక్తులను ఎక్కువగా ఆకర్షిస్తున్నది మహా కుంభమేళాకు హాజరైన నాగసాధువులు. నాగసాధువులు మాత్రం బట్టలు ధరించకున్నా గడ్డకట్టించే చలిలోనూ తట్టుకుని ఎలా నిలబడగలిగారనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. దీని వెనక ఉన్న రహస్యమిదే..