ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వ్యక్తి మృతదేహం లభ్యం

ABN, Publish Date - Nov 14 , 2024 | 12:45 AM

తిరుమలగిరి(సాగర్‌), నవంబరు 13(ఆంధ్రజ్యోతి): ఆర్థిక ఇబ్బందులు, జీవితంపై విరక్తితో అక్టోబరు 28న ఆత్మ హత్యకు పాల్పడిన వ్యక్తి మృతదేహం బుధవారం లభ్యమైంది.

తిరుమలగిరి(సాగర్‌), నవంబరు 13(ఆంధ్రజ్యోతి): ఆర్థిక ఇబ్బందులు, జీవితంపై విరక్తితో అక్టోబరు 28న ఆత్మ హత్యకు పాల్పడిన వ్యక్తి మృతదేహం బుధవారం లభ్యమైంది. స్థానిక ఎస్‌ఐ కె.వీరశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అడవిదే వులపల్లి మండలంలోని కొత్తనందికొండకు చెందిన కొర్ర రాజశేఖర్‌(24) హైదరా బాద్‌లోని ఆటోను నడుపు కుంటూ మీర్‌పేటలో నివాసం ఉండేవాడు. అయితే రాజ శేఖర్‌ అక్టోబరు 27న కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఒంట రిగా హైదరాబాద్‌ నుంచి నాగార్జునసాగర్‌కు వచ్చాడు. అక్టో బరు 28న సాగర్‌ సమీపం లోని నాగార్జునపేటతండా గ్రావ శివారులోని అటవీ ప్రాంతానికి వెళ్లి తాను ఆత్మహత్య చేసు కుంటున్నట్లు భార్య మమతకు ఫోన్‌లో చెప్పి అనంతరం స్విచ్ఛాఫ్‌ చేశాడు. అనంతరం పురుగుల మందు తాగాడు. దీంతో భార్య స్థానిక బంధువుల ద్వారా మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. విషయాన్ని బంధువులకు కూడా తెలుపడంతో వారు వెతుకు తున్నారు. ఈ క్రమంలో బుధ వారం నాగార్జున పేటలో చెట్ల పొదల్లో కుళ్లిపోయిన మృత దేహాన్ని ఓ గొర్రెల కాపరి చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటన స్థల ానికి వెళ్లి పరిశీలించగా మృతదేహం పక్కన మృతుడి ఫోన్‌ లభ్య మైంది. ఫోన్‌లో లభ్యమైన నంబర్ల ఆధారంగా మృతి చెంది న వ్యక్తి రాజశేఖర్‌గా గుర్తించారు. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండడంతో వైద్యులు పంచనామా నిర్వహించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. మృతుడి అన్న కొర్ర సురేష్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

Updated Date - Nov 14 , 2024 | 12:45 AM