Valentines day: వాలెంటైన్ డే స్కామ్స్.. క్లిక్ చేస్తే అంతే ఇక
ABN, Publish Date - Feb 14 , 2024 | 03:54 PM
సైబర్ నేరగాళ్లు ఏ రోజును కూడా వదలడం లేదు. ఈ దుండగులు ఇటివల రామమందిర్ పేరుతో ఫేక్ వెబ్‌సైట్ క్రియేట్ చేసి పలువురి నుంచి డబ్బులు దోచుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా యువతను టార్గెట్ చేసి షాపింగ్, బహుమతుల పేరుతో ఎర వేస్తున్నారు.
సైబర్ నేరగాళ్లు ఏ రోజును కూడా వదలడం లేదు. ఈ దుండగులు ఇటివల రామమందిర్ పేరుతో ఫేక్ వెబ్‌సైట్ క్రియేట్ చేసి పలువురి నుంచి డబ్బులు దోచుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా యువతను టార్గెట్ చేసి షాపింగ్, బహుమతుల పేరుతో ఎర వేస్తున్నారు. అయితే వీరి బారిన పడుతున్న వారిలో ఎక్కువ మంది భారతీయులే ఉండటం విశేషం.
వాస్తవానికి నిజమైన వ్యక్తితో కాకుండా AI రూపొందించిన బాట్‌తో 26 శాతం మంది భారతీయులు సంభాషిస్తున్నారని ఓ సర్వే తెలిపింది. దీంతోపాటు 77 శాతం మంది భారతీయులు డేటింగ్ వెబ్‌సైట్‌లు, పలు రకాల యాప్‌లను ఉపయోగిస్తున్నారని వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారతీయులు సైబర్ నేరగాళ్ల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా లేదా టెక్స్ట్ మెసేజ్ ద్వారా అపరిచిత వ్యక్తులు పంపించే సందేశాలకు రిప్లై ఇవ్వకూడదని అంటున్నారు.
అయితే వాలెంటైన్స్ డే రోజున యువత ఎక్కువగా ఆన్‌లైన్‌లో షాపింగ్, బహుమతులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే వారిని తప్పుదారి పట్టించి నేరగాళ్లు డబ్బులు దండుకుంటున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్కామర్‌లు నకిలీ డేటింగ్ సైట్లను క్రియేట్ చేసి తప్పుదారి పట్టిస్తున్నారు. అనేక డిస్కౌంట్లు, ఆఫర్ల పేరుతో కూడా దుండగులు చీట్ చేస్తున్నారు. అక్కడ వారు నెమ్మదిగా సంభాషించి మీ సున్నితమైన సమాచారాన్ని సేకరించి మోసాలకు పాల్పడుతున్నారు.
ఈ క్రమంలో ఆయా లింక్‌లు పూర్తిగా నకిలీవని, వాటిని క్లిక్ చేయడం ద్వారా మీరు ఆన్‌లైన్ మోసానికి గురయ్యే అవకాశం ఉందని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు. వినియోగదారులు Insta, Facebook లేదా Twitter వంటి సోషల్ మీడియాలో వాలెంటైన్స్ డే బహుమతుల పేరుతో వచ్చే థర్డ్ పార్టీ లింక్‌లపై క్లిక్ చేయకూడదని అంటున్నారు.
Updated Date - Feb 14 , 2024 | 03:55 PM