అనుగ్రహం... 15 - 21 డిసెంబర్ 2024
ABN, Publish Date - Dec 15 , 2024 | 11:39 AM
ఆర్థికంగా బాగుంటుంది. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. స్నేహసంబంధాలు బలపడతాయి. కొత్త పనులు చేపడతారు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. విమర్శలు పట్టించు కోవద్దు.
- పి.ప్రసూనా రామన్
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
ఆర్థికంగా బాగుంటుంది. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. స్నేహసంబంధాలు బలపడతాయి. కొత్త పనులు చేపడతారు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. విమర్శలు పట్టించు కోవద్దు. మనోధైర్యంతో ముందుకు సాగండి. కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. ఎదుటి వారి ఆంతర్యం గ్రహించండి. భేషజాలకు పోవద్దు. చెల్లింపుల్లో జాగ్రత్త.
కర్కాటకం:
పునర్వసు 4వ
పాదం, పుష్యమి, ఆశ్లేష
అన్ని విధాలా అనుకూల దాయకం. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ధనలాభం ఉంది. విలాసాలకు వ్యయం చేస్తారు. బంధువులతో సంబంధాలు మరింత బలపడతాయి. ఆదివారం నాడు ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయాన్నీ సమస్యగా పరిగణించవద్దు. ఆత్మీయులతో సంభాషణ కార్యోన్ముఖులను చేస్తుంది. ధైర్యంగా ముందుకు సాగుతారు.
తుల:
చిత్త 3,4; స్వాతి,
విశాఖ 1,2,3 పాదాలు
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం బాగుంటుంది. ఆత్మీ యులతో ఉల్లాసంగా గడుపుతారు. కొన్ని పనులు అనుకోకుండా పూర్తవుతాయి. పరి చయస్తులతో తరచూ సంభాషిస్తారు. శుక్ర, శనివారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగ వద్దు, ఆరోగ్యం జాగ్రత్త. ఆధ్మాత్మికత పెంపొం దుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
మకరం:
ఉత్తరాషాఢ 2,3,4;
శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధా నం. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. అనుమానాలు, అపోహలకు గురికావద్దు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. సామ రస్యంగా మెలగండి. విమర్శించిన వారే తమ తప్పును తెలుసుకుంటారు. బుధవారం నాడు చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. రావలసిన ధనం ఆలస్యంగా అందుతుంది. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఆప్తులు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు.
వృషభం:
కృత్తిక 2,3,4; రోహిణి,
మృగశిర 1,2 పాదాలు
అనుకూలతలు అంతంత మాత్రమే. ఆచితూచి అడుగేయండి. ప్రలో భాలకు లొంగవద్దు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఖర్చులు అదుపులో ఉండవు. ఆప్తుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. పనులు చురుకుగా సాగుతాయి. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. పిల్లల దూకుడు అదుపుచేయండి. కీలక పత్రాలు అందుకుంటారు. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు.
సింహం:
మఖ, పుబ్బ,
ఉత్తర 1వ పాదం
వ్యవహారానుకూలత ఉంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవ కాశాలు కలిసివస్తాయి. గుట్టుగా మెలగండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. ప్రణాళి కాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. పత్రాల రెన్యువల్‌ల్లో జాప్యం తగదు. మీ అభి ప్రాయాలకు స్పందన లభిస్తుంది. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి.
వృశ్చికం:
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
విశేషఫలితాలు గోచరి స్తున్నాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు. రావలసిన ధనం అందుతుంది. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. ఒక శుభవార్త గృహంలో సంతోషాన్ని నింపు తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు.
కుంభం:
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
ప్రతికూలతలు విపరీతం. రుణఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు. చిన్న విషయానికే చికాకుపడతారు. మీ కోప తాపాలు అదుపులో ఉంచుకోండి. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. విమర్శలు పట్టించుకోవద్దు. పట్టుదలతోనే అనుకున్నది సాధిస్తారు. ఆప్తులతో కాలక్షేపం చేయండి. దుబారా ఖర్చులు విపరీతం. గురువారం నాడు పనులు ఒక పట్టాన సాగవు. కనిపించ కుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి.
మిథునం:
మృగశిర 3,4; ఆర్ద్ర,
పునర్వసు 1,2,3 పాదాలు
కార్యసాధనకు సంకల్పసిద్థి ప్రధానం. ధైర్యంగా యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. శనివారం నాడు అపరిచితులతో జాగ్రత్త. అందరితోనుమితంగా సంభాషించండి. పెద్దఖర్చు తగిలే సూచనలు న్నాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. పత్రాల రెన్యువల్‌లో ఏకాగ్రత వహించండి.
కన్య:
ఉత్తర 2,3,4; హస్త,
చిత్త 1,2 పాదాలు
ఈ వారం కలిసివచ్చే సమయం. ధైర్యంగా ముందుకు సాగుతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. ఆర్థికపరంగా మంచి ఫలితాలున్నాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. బంధు మిత్రులతో కాలక్షేపం చేస్తారు. చేపట్టిన పనుల్లో ఒత్తిడికి గురికావద్దు. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది.
ధనుస్సు:
మూల, పూర్వాషాఢ,
ఉత్తరాషాఢ 1వ పాదం
శ్రమతో కూడిన ఫలితాలు న్నాయి. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగు తాయి. సంకల్పబలంతో లక్ష్యాన్ని సాధిస్తారు. బాకీలను లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఊహించని ఖర్చులుంటాయి, పొదుపునకు అవకాశం లేదు. సోమ, మంగళవారాల్లో కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలు న్నాయి. అందరితోనూ మితంగా సంభాషించండి. ఆగ్రహావేశాలకు గురికావద్దు.
మీనం:
పూర్వాభాద్ర 4వ
పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
చక్కని ప్రణాళికలతో ముం దుకు సాగుతారు. అంచనాలు ఫలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పనులు చురు కుగా సాగుతాయి. ప్రముఖులకు సన్నిహితు లవుతారు. గిట్టని వ్యక్తులతో జాగ్రత్త. ఏ విష యాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఆత్మీయులతో తరుచూ సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్సాహం కలిగిస్తుంది. శనివారం నాడు ఇతరుల విషయాల్లో జోక్యం తగదు.
Updated Date - Dec 15 , 2024 | 11:39 AM