ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chanakya Niti: జీవితంలో ఈ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వొద్దు..!

ABN, Publish Date - Aug 21 , 2024 | 09:35 AM

చాణక్య నీతి ప్రకారం.. ఒక వ్యక్తి తన జీవితంలో పొరపాటున ఒక విషయాన్ని అస్సలు సహించొద్దు. ఒకవేళ పట్టించుకోకుండా ఉన్నట్లయితే.. ప్రజలలో మీ ఇమేజ్ కూడా చెడిపోతుంది. ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. జీవితాంతం ఉక్కిరిబిక్కిరి అయి జీవించాల్సి ఉంటుంది. పొరపాటున కూడా ప్రజలు సహించకూడని విషయం ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం..

Chanakya Niti

Chanakya Niti: చాణక్య నీతి.. వ్యక్తి జీవితం పరిపూర్ణం కావడానికి అద్భుతమైన మార్గం. ఆచార్య చాణక్యుడు రచించిన ఈ చాణక్య నీతి గ్రంధం.. ప్రజలకు ఇప్పటికీ ఎప్పటికీ ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి సంశయం లేదు. చాణక్య నీతి సూత్రాలను పాటించడం ద్వారా వ్యక్తి జీవితంలో సమస్యలను సునాయాసంగా ఎదుర్కోగలరు. జీవితంలో సక్సెస్ సాధించగలరు. ఆచార్య చాణక్యుడు తన గ్రంథంలో సామాన్యులకు ఉపయోగపడే ఎన్నో అంశాలను పేర్కొన్నారు. ఒక వ్యక్తి ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఎలా జీవించాలి? ఎలా జీవించకూడదు? ఇలా ఒకటేమిటి.. మనిషి పుట్టుక నుంచి చనిపోయే వరకు ఎలా ఉండాలనేది కూలంకశంగా పేర్కొన్నారు. అయితే, ఇవాళ మనం వ్యక్తి తన జీవితంలో సక్సెస్ సాధించాలంటే ఏం చేయాలి? ఎలాంటి విషయాను పట్టించుకోవాలి? ఎలాంటి విషయాలను విస్మరించాలి? అనే వివరాలను తెలుసుకుందాం.


ఆచార్య చాణక్యుడి ప్రకారం.. ఏ వ్యక్తి కూడా అవమానాన్ని సహించకూడదు. అవమానం విషం కంటే ప్రమాదకరమైంది. దీనిని ఎవరూ సహించొద్దంటారు చాణక్య. ప్రతి వ్యక్తి జీవితంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయని.. అవమానాలను భరించకుండా తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. అవమానాలను భరిస్తూ జీవితం గడపడం చాలా కష్టమని చాణక్యనీతిలో పేర్కొన్నారు. అవమానాలు వ్యక్తి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయని.. జీవితమంతా నిరాశా నిస్పృహలతో గడపాల్సి ఉంటుందని ఆచార్య చెప్పారు.


అవమానాలను విస్మరించవద్దు..

ఎవరైనా మిమ్మల్ని ఒకసారి అవమానిస్తే.. వారిని విస్మరించవచ్చు. కానీ ఎవరైనా మిమ్మల్ని పదే పదే అవమానిస్తే మాత్రం ఖచ్చితంగా వారికి సమాధానం ఇవ్వాలి. ఎందుకంటే ఎటువంటి కారణం లేకుండా అవమానాన్ని సహించడం తప్పు. పదే పదే అవమానాలు ఎదుర్కొనే వ్యక్తి స్థాయి కూడా సమాజంలో తగ్గిపోతుంది. దీంతో పాటు, ప్రజల్లో ఆ వ్యక్తి చులకనగా మారిపోతారు. అలాంటి పరిస్థితిలో ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే.. సమయానికి అతన్ని ఆపడం ముఖ్యం. లేదంటే సమాజంలో మీ ప్రతిష్ట మసకబారుతుంది.


Also Read:

అనుమతులపై హైడ్రా ఆరా.. అడ్డగోలుగా ఎన్‌వోసీలు!

హైదరాబాద్‌లో వాన దడ.. నేడు, రేపు భారీ వర్షాలు

తాడిపత్రిలో హైటెన్షన్‌!.. పెద్దారెడ్డి రాకతో ఉద్రిక్తత

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 21 , 2024 | 09:37 AM

Advertising
Advertising
<