ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kedarnath Dham: కేదార్‌నాథ్ వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్..

ABN, Publish Date - Mar 08 , 2024 | 07:54 PM

Dehradun News: కేదార్‌నాథ్ వెళ్లాలనుకునే భక్తులకు బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ(BKTC) శుభవార్త చెప్పింది. మే 10వ తేదీన ఉదయం 7 గంటలకు కేదార్‌నాథ్ ఆలయాన్ని(Kedarnath Dham) తెరవనున్నట్లు ప్రకటించారు. మహాశివరాత్రి(Mahashivratri) సందర్భంగా బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ ఈ ప్రకటన చేసింది. మే 10వ తేదీన భక్తుల సందర్శనార్థం ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయని తెలిపారు.

Kedarnath Dham

డెహ్రాడూన్, మార్చి 8: కేదార్‌నాథ్ వెళ్లాలనుకునే భక్తులకు బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ(BKTC) శుభవార్త చెప్పింది. మే 10వ తేదీన ఉదయం 7 గంటలకు కేదార్‌నాథ్ ఆలయాన్ని(Kedarnath Dham) తెరవనున్నట్లు ప్రకటించారు. మహాశివరాత్రి(Mahashivratri) సందర్భంగా బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ ఈ ప్రకటన చేసింది. మే 10వ తేదీన భక్తుల సందర్శనార్థం ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయని తెలిపారు. ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయంలో బీకేటీసీ చైర్మన్ అజేంద్ర అజయ్ ఈ విషయాన్ని ప్రకటించారు.

ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రజలు సందర్శించే ఈ దేవాలయాన్ని మంచు కారణంగా శీతాకాలంలో మూసివేస్తారు. వేసవి కాలంలో తిరిగి ఆలయాన్ని తెరుస్తారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన అజయ్.. గత యాత్రా సీజన్‌లో రికార్డు స్థాయిలో భక్తులు కేదార్‌నాథ్ ధామ్‌ను సందర్శించారని, ఈ ఏడాది యాత్రికుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేశారు. “ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నాయకత్వంలో, రాష్ట్ర ప్రభుత్వం, ఆలయ కమిటీ యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి నిబద్ధతతో పని చేస్తున్నాయి” అని చైర్మన్ చెప్పారు.

యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆలయ కమిటీ బృందం త్వరలో ఆలయాన్ని సందర్శిస్తుందని ఆయన తెలిపారు. ఫ్రాంటియర్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ చండీ ప్రసాద్ భట్ పచ్చగై, కేదార్‌నాథ్ ధామ్ ప్రధాన పూజారి రావల్ భీమశంకర్ లింగ్ ఓంకారేశ్వర్ ఆలయంలో జరిగిన మహాశివరాత్రి వేడుకలకు హాజరయ్యారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 08 , 2024 | 07:54 PM

Advertising
Advertising