Diwali 2024: నరకాసురుడు ఎవరు ? దీపావళి రోజు అతని దిష్టిబొమ్మను ఎందుకు దహనం చేస్తారంటే..?
ABN, Publish Date - Oct 31 , 2024 | 04:46 PM
ఉమ్మడి కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం నడకుదురు గ్రామానికి నరకాసురుడికి ఉన్న బంధం ఏమిటి? సత్యభామా.. నరకాసురుడిని అక్కడే చంపింది. ఆ గ్రామంలోనే అతడిని ఎందుకు చంపిందంటే...
దసరా నవరాత్రులతో ఆశ్వయుజమాసం ప్రారంభమైతే.. దీపావళి పండగతో ఈ మాసం ముగుస్తుంది. ఈ మాసంలో వచ్చే ఈ రెండు పండగలు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక నిర్వహిస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే దసరా పర్వదినం రోజు రావణాసురుడి బొమ్మను దహనం చేస్తారు. ఇక దీపావళి వేళ నరకాసురుడి బొమ్మను దహనం చేస్తారు. దసరా రోజు రావణాసురుడుని దహనం చేస్తారంటే.. సీతాదేవిని లంకకు తీసుకు వెళ్లాడు. రావణుడిని సంహరించి సీతతో శ్రీరాముడు ఆయోధ్యకు చేరుకున్నాడంటూ పురాణాలు పేర్కొంటున్నాయి. మరి దీపావళి వేళ.. నరకాసురుడి బొమ్మను ఎందుకు దహనం చేస్తారంటే..?
Also Read: ఆలూ చిప్స్.. ఆరోగ్యానికి లాభమా? నష్టమా?
ఇంతకీ నరకాసురుడు ఎవరు?
ద్వాపర యుగంలో ప్రాగ్నోషికపురం ప్రాంతాన్ని నరకుడు పాలించేవాడు. అతడు శివుడి కోసం ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమవుతాడు. ఆ క్రమంలో తల్లి చేతిలో తప్ప మరొకరి వల్ల తనకు మృత్యువు సంభవించకూడదనే వరాన్ని శివుడు నుంచి నరకుడు పొందుతాడు. నరకుడు ఓ రోజు వేటకు వెళ్లతాడు. దీంతో జంతువుపై వదిలిన బాణం గురి తప్పి.. ద్విముఖుడు అనే బ్రాహ్మణుడికి తగులుతుంది. దీంతో అతడు మరణిస్తాడు. తనకు బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుందంటూ నరకుడు తీవ్ర కలత చెందుతాడు. దాంతో ఈ బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి పొందడం కోసం ఏం చేయాలో వివరించాలంటూ గురువును ఆశ్రయిస్తాడీ నరకుడు.
కృష్ణానది తీరం..
కృష్ణానది తీరంలో భూమి నుంచి ఉద్భవించిన శివలింగం ఉంది. ఈ శివ లింగాన్ని పుష్కరం పాటు అంటే. 12 ఏళ్ల పాటు ఆరాధించడం ద్వారా ఈ దోషం పరిహారమవుతుందని నరకుడికి గురువు వివరిస్తాడు. అందులోభాగంగా కృష్ణానదీ పరివాహక ప్రాంతంలోని నడకుదురులో కొలువు తీరిన శ్రీబాలాత్రిపుర సుందరిదేవి సమేత శ్రీపృథ్వీశ్వరస్వామి వారిని నరకుడు నిత్యం పూజిస్తూ ఉంటాడు.
రాక్షస ప్రవృత్తి..
అయితే అదే సమయంలో తనకున్న రాక్షస ప్రవృత్తి కారణంగా.. ఆ ప్రాంతంలోని మహిళలను బంధించి, హింసించడం ప్రారంభిస్తాడు. దీంతో మహిళలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతారు. తమను రక్షించాలంటూ శ్రీకృష్ణుడిని వారంతా వేడుకుంటారు. సత్యభామాతో కలిసి అక్కడకు వచ్చిన స్వామి.. మహిళలందరినీ రాక్షసుడు నరకాసురుడి బారి నుంచి రక్షిస్తాడు.
శ్రీకృష్ణుడిపై నరకాసురుడు ఆగ్రహం..
దీంతో శ్రీకృష్ణుడిపై నరకాసురుడు ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. దాంతో శ్రీకృష్ణుడిపై యుద్దానికి సిద్దమవుతాడు. ఈ యుద్దంలో శ్రీకృష్ణుడు కొద్ది సేపు స్పృహా కోల్పోతాడు. దీంతో అక్కడే ఉన్న సత్యభామ.. నరకాసురుడిపై కోపగించుకుంటుంది. దీంతో యుద్ద రంగంలోకి దూకి నరకాసురుడిని సంహరిస్తుంది. ఆ క్రమంలో ఈ ఆలయానికి నరకోత్తరక్షేత్రంగా పేరు పొందింది. ఆశ్వయుజ శుద్ధ చతుర్దశి రోజు నరకుడి పీడ వదిలింది. ఈ నేపథ్యంలో ఆ రోజును నరక చతుర్దశి అని పిలుస్తారు.
అలా దీపావళి..
ఆ రోజున ప్రజలంతా ఆనందోత్సాహాలతో బాణసంచా కాలుస్తారు. అలా దీపావళి పర్వదినం వచ్చింది. దాంతో దీపావళి వేళ.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నరకాసురుడి బొమ్మను ప్రజలు దహనం చేస్తారు. ఇక ఈ నరకోత్తరక్షేత్రం కాలక్రమేణా నడకుదురుగా పేరు పొందింది. ఈ నడకుదురు గ్రామం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని చల్లపల్లి మండలంలో ఉంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Oct 31 , 2024 | 05:19 PM