ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tirumala Laddu: తిరుమల లడ్డూను ఎలా తయారీ చేస్తారంటే..?

ABN, Publish Date - Sep 20 , 2024 | 04:09 PM

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొనేందుకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు తిరుమలకు ప్రతీ రోజు పోటెత్తుతుంటారు. ఆనంద నిలయంలో స్వామి వారి నిలువెత్తు విగ్రహాన్ని దర్శించుకుని తన్మయత్వం పొందుతారు. అనంతరం ఆలయం వెలుపల శ్రీవారి ప్రసాదంగా లడ్డూను ప్రతి భక్తుడు స్వీకరిస్తాడు.

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొనేందుకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు తిరుమలకు ప్రతీ రోజు పోటెత్తుతుంటారు. ఆనంద నిలయంలో స్వామి వారి నిలువెత్తు విగ్రహాన్ని దర్శించుకుని తన్మయత్వం పొందుతారు. అనంతరం ఆలయం వెలుపల శ్రీవారి ప్రసాదంగా లడ్డూను ప్రతి భక్తుడు స్వీకరిస్తాడు. పచ్చ కర్పురం, నెయ్యి, ఎండు ద్రాక్ష‌, జీడిపప్పులతోపాటు యాలుకల వాసనతో స్వామి వారం ప్రసాదం ఘుమఘుమలాడుతుంది. అలాంటి లడ్డూ తయారీలో.. గత ప్రభుత్వం హయాంలో నిషిద్ద పదార్ధాలు వాడినట్లు విమర్శలు గుప్పుమన్నాయి. అలాంటి వేళ.. ఆ బ్రహ్మాండ నాయకుడి ప్రసాదం లడ్డూ తయారీలో వినియోగించే అసలు పదార్థాలు ఏమిటి.. వాటి వివరాలు.. పక్కా లెక్కల ప్రకారం..


5,100 లడ్డూల తయారీకి 803 కిలోల ముడి సరుకులను వినియోగిస్తారు. 180 కేజీల శనగపిండి, 165 కేజీల ఆవు నెయ్యి, 400 కేజీల పంచదార, 30 కేజీల జీడిపప్పు, 16 కేజీల ఎండు ద్రాక్ష, 8 కేజీల కలకండ, 4 కేజీల యాలుకలు ఉపయోగిస్తారు. ఇక ఈ లడ్డూల తయారీలో వైష్ణవ బ్రాహ్మణులదే కీలక పాత్ర. అనాదిగా బూంది తయారి నుండి లడ్డులు కట్టే వరకు వీరు సాంప్రదాయ బద్దంగా సుచిగా ఆచారాలను పాటిస్తుంటారు. తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో లడ్డులను తయారు చేసే వంటశాల వుంది. దీన్ని పోటు అంటారు. గతంలో కట్టెల పొయ్యి మీద లడ్డులు, ఇతర పదార్థాలు తయారు చేసే వారు. ప్రస్తుతం ఆధునిక సామాగ్రి అందుబాటులోకి రావడంతో వాటి ద్వారా లడ్డూలు తయారీ చేస్తున్నారు.

Also Read: Pitru Pakshalu 2024: పితృపక్ష దోష నివారణకు ఇదే సమయం.. పురుషులు అసలు చేయకూడని పనులు


పూర్వం లడ్డూకు బదులు శ్రీవారి ప్రసాదంగా బూందీని భక్తులకు అందించే వారని సమాచారం. క్రీ.శ 1803లో బూందీగా ప్రారంభమైన తిరుమల ప్రసాదం.. కాలక్రమంలో 1940 నాటికి లడ్డూగా మారినట్లు ఆగమశాస్త్ర పండితులు పేర్కొంటున్నారు. దాంతో 1940ని ప్రామాణికంగా తీసుకుంటే లడ్డూ వయసు వందేళ్లలోపే అవుతుంది. కానీ పల్లవ రాజుల కాలం నాటి నుంచే శ్రీవారి ప్రసాదాన్ని అందిస్తున్నట్లు చారిత్రక ఆధారాలు సైతం ఉన్నాయి. మరోవైపు విజయ నగర సామ్రాజ్యానికి చెందిన రెండో దేవరాయలు కాలం నాటి నుంచి స్వామి వారి దేవాలయంలో ప్రసాదాలు అందించినట్లు పలు ఆధారాలు సైతం లభ్యమైనాయి.


ఇంకోవైపు తిరుమల శ్రీవారి ప్రసాదంగా లడ్డూ పంపిణీ సుమారు 300 ఏళ్ల కిందటే ప్రారంభమైందని సమాచారం. 1715 ఆగస్టు 2వ తేదీన తొలిసారిగా లడ్డూను తిరుమల ప్రసాదంగా భక్తులకు అందించారని తెలుస్తోంది. 2010 వరకూ రోజుకు లక్ష వరకూ లడ్డూలను తయారు చేసేవారు. ఆ తర్వాత భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రతీ రోజు 3.20 లక్షల లడ్డూలు తయారు చేస్తున్నారు. స్వామి వారి లడ్డూకు 2014లో జీఐ గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే.

For More Devotional News and Telugu New

Updated Date - Sep 20 , 2024 | 04:50 PM