ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Koti Somavaram 2024: కార్తీక శనివారం రోజు కోటి సోమవారం ఎలా అయ్యింది.. ఈ రోజు దీపం వెలిగించారా

ABN, Publish Date - Nov 09 , 2024 | 02:20 PM

కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు ఎంతో విశిష్టమైనవని తెలుసు. కానీ, కార్తీక శనివారం రోజు వచ్చిన కోటి సోమవారం కూడా కోటి జన్మల పుణ్య ఫలితాన్ని ఇవ్వగలదు..

Koti Somavaram

కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారానికి ఎంతో విశిష్టత ఉంది. ఈరోజున దీపం వెలిగిస్తే కోటి రెట్ల ఫలితం కలుగుతుందంటారు. అయితే, కోటి సోమవారం అంటే చాలా మంది సోమవారం రోజున అనుకుంటారు. కానీ, కార్తీక మాసంలో వచ్చే ప్రత్యేక తిథని కోటి సోమవారంగా జరుపుకుంటారు.


ఈ పవిత్రమైన రోజు ఈ సారి శనివారం రోజున వచ్చింది. అంటే .. సప్తమి తిథి, శ్రవణా నక్షత్రంతో కలిసి వస్తే దాన్నే కోటి సోమవారంగా జరుపుకుంటారు. ముఖ్యంగా శివ కేశవుల మధ్య ఎలాంటి భేదం లేదని ఈ రోజు రుజువు చేస్తుంది. ఎందుకంటే.. శ్రవణా నక్షత్రం వెంకటేశ్వరస్వామి జన్మ నక్షత్రం. కార్తీక మాసం శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఇలా హరి హరులు ఒక్కరేనని తెలిపేలా ఈ రోజున పూజాధికార్యక్రమాలు నిర్వహిస్తారు.


అయితే, దీపం వెలిగించే ఘడియలు నవంబర్ 8 రాత్రి 12 గంటలకు మొదలై 9వ తేదీ ఉదయం 11:47 గంటలకు ముగుస్తోంది. ఈ సమయంలో దీపం వెలిగించినవారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని శాస్త్రం చెప్తోంది. అంతేకాదు తెలిసో తెలియక చేసిన పాపాల నుంచి విముక్తి కలిగించే రోజు ఇది. అందుకే ఈ రోజు వెలిగించే దీపం కోటి జన్మల పాపాలను కరిగిస్తుందని చెప్తారు.


ఈ రోజు ఉపవాసం ఉంటూ శివాలయాలను సందర్శించుకోవడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. సాయంత్రం ప్రదోష కాల సమయంలో దీపారాధన చేయాలి. కార్తిక మాసంలో నదులు, సముద్ర స్నానానికి ఎంతో ప్రత్యేకత ఉంది. నదీ స్నానం అనంతరం ఉపవాసం ఉండటం, దీపారాధన, దీప దానం, సాలగ్రామ పూజ, వన సమారాధనలు ఈ నెల పొడవునా అచరిస్తారు. కార్తిక మాసంలో శ్రీమహా విష్ణువు నదులు, చెరువుల్లో నివసిస్తాడని విశ్వసిస్తారు.

అందుకే ఈ మాసంలో నదీ స్నానానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. నదీ స్నానం కుదరనప్పుడు కార్తీక మాసంలో అన్ని రోజుల్లోనూ సూర్యోదయానికి ముందే చన్నీటి స్నానం చేయాలి. గంగ, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మద, తపతి, సింధు నదులను స్మరించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం, మాంసాన్ని ముట్టుకోకూడదు.

Updated Date - Nov 09 , 2024 | 02:25 PM