ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శ్రీ విఘ్నేశ్వరుని మంగళహారతులు

ABN, Publish Date - Sep 07 , 2024 | 10:41 AM

శ్రీశంభుతనయునకు సిద్ధిగణనాథునకు వాసిగల దేవతావంద్యునకును ఆ సరస విద్యలకు ఆది గురువైనట్టి భూసురోత్తమ లోకపూజ్యునకును శ్రీశ్రీ జయ మంగళం నిత్య శుభమంగళం శ్రీశ్రీ నేరేడు మారేడు నెలవంక మామిడి దుర్వార చెంగల్వ ఉత్తరేణు వేరువేరుగదెచ్చి వేడ్కతో పూజింతు పర్వమున దేవగణపతికినిపుడు శ్రీశ్రీ జయ శ్రీశ్రీ

శ్రీశంభుతనయునకు సిద్ధిగణనాథునకు వాసిగల దేవతావంద్యునకును

ఆ సరస విద్యలకు ఆది గురువైనట్టి భూసురోత్తమ లోకపూజ్యునకును

శ్రీశ్రీ జయ మంగళం నిత్య శుభమంగళం శ్రీశ్రీ

నేరేడు మారేడు నెలవంక మామిడి దుర్వార చెంగల్వ ఉత్తరేణు

వేరువేరుగదెచ్చి వేడ్కతో పూజింతు పర్వమున దేవగణపతికినిపుడు శ్రీశ్రీ జయ శ్రీశ్రీ

సుచిరముగ భాద్రపద శుద్ధ చవితియందు పొసగ సజ్జనులచే పూజగొల్తు

శశి చూడరాదన్న జేకొంటి నొక వ్రతము పర్వమున దేవగణపతికినిపుడు శ్రీశ్రీ జయ శ్రీశ్రీ


పానకము వడపప్పు పనస మామిడిపండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్షపండ్లు

తేనెతో మాగిన తియ్య మామిడి పండ్లు మాకు బుద్ధినిచ్చు గణపతికినిపుడు శ్రీశ్రీ జయ శ్రీశ్రీ

ఓ బొజ్జ గణపయ్య నీ బంటునేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండుపంపు

కమ్మనినెయ్యయ్య కడుముద్దపపను బొజ్జవిరుగగ దినుచును పొరలుచున్‌ శ్రీశ్రీ జయ శ్రీశ్రీ

వెండి పళ్ళెములోన వేయినేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి

మెండుగను హారములు మెడనిండ వేసికొని దండిగా నీకిత్తు ధవళారతి శ్రీశ్రీ జయ శ్రీశ్రీ

పువ్వులను నినుగొల్తు పుష్పాల నినుగొల్తు గంధాల నినుగొల్తు కస్తూరినీ

ఎప్పుడూ నినుగొల్తు ఏకచిత్తమ్మున పర్వమున దేవగణపతికినిపుడు శ్రీశ్రీ జయ శ్రీశ్రీ


ఏకదంతంబును ఎల్లగజవదనంబు బాగయిన తొండంబు వలపు కడుపు

జోకయిన మూషికము పరక నెక్కాడుచు భవ్యుడగు దేవగణపతికినిపుడు శ్రీశ్రీ జయ శ్రీశ్రీ

మంగళము మంగళము మార్తాండ తేజునకు మంగళము సర్వజ్ఞ వందితునకు

మంగళము ముల్లోక మహిత సంచారునకు మంగళము దేవగణపతికినిపుడు శ్రీశ్రీ జయ శ్రీశ్రీ

సిద్ధివిఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజింతు ఒనరంగ నిరువదియొక్క పత్రి

దానిమ్మ మరువమ్ము దర్భ విష్ణుక్రాంత యుమ్మెత్త దూర్వార యుత్తరేణి శ్రీశ్రీ జయ శ్రీశ్రీ

కలువలు మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచన రేగు దేవదారు


జాజి బలురక్కసి జమ్మిదాసానపువ్వు గరికి మాచిపత్రి మంచి మొలక శ్రీశ్రీ జయ శ్రీశ్రీ

అగరు గంధాక్షత ధూప దీప నైవేద్య తాంబూల పుష్పోపహారములను

భాద్రపద శుద్ధ చవితిని కుడుములు నానుబ్రాలు ఉండ్రాళ్ళు పప్పు శ్రీశ్రీ జయ శ్రీశ్రీ

పాయసము జున్ను తేనెయు భక్తిమీర

కోరిపూజింతు నిన్నెపుడు కోర్కెలలర శ్రీశ్రీ జయ శ్రీశ్రీ

బంగారు చెంబుతో గంగోదకముదెచ్చి సంగతిగ శిశువునకు జలకమార్చి

మల్లెపువ్వులు దెచ్చి మురహరిని పూజింతురంగైన నా ప్రాణలింగమునకును శ్రీశ్రీ జయ శ్రీశ్రీ

పట్టుచీరలు మంచి పాడిపంటలు గల్గి ఘనముగా కనకములు కరులు హరులు

ఇష్ట సంపదలిచ్చి యేలిన స్వామికి పట్టభద్రుని దేవ గణపతికినిపుడు శ్రీశ్రీ జయ శ్రీశ్రీ


ముక్కంటి తనయుడని ముదముతో నేనును చక్కనైన వస్తు సమితి గూర్చి

నిక్కముగ మనమును నీయందె నేనిల్పి ఎక్కువగు పూజలాలింపజేతు శ్రీశ్రీ జయ శ్రీశ్రీ

మల్లెలా మొల్లలా మంచి సంపెంగలా చల్లనైనా గంధసారములను

ఉల్లమలరగ మంచి ఉత్తమపు పూజలు కొల్లలుగ నేజేతు కోరి విఘ్నేశ శ్రీశ్రీ జయ శ్రీశ్రీ

దేవాదిదేవునకు దేవతారాధ్యునకు దేవేంద్రవంద్యునకు దేవునకును

దేవతలు మిముగొల్చు తెలిసి పూజింతురు భవ్యుడగు దేవగణపతికినిపుడు శ్రీశ్రీ జయ శ్రీశ్రీ


చెంగల్వ చేమంతి చెలరేగి గన్నేరు తామరలు తంగేడు తరచుగాను

పుష్పజాతులు తెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ధ గణపతికి బాగుగాను శ్రీశ్రీ జయ శ్రీశ్రీ

మారేడు మామిడి మాదీఫలంబులు ఖర్జూర పనసలును కదళికములు

నేరేడు నెంవంది టెంకాయ తేనెయు చాలగా నిచ్చెదరు చనువుతోడ శ్రీశ్రీ జయ శ్రీశ్రీ

ఓ బొజ్జ గణపతి ఓర్పుతో రక్షించి కాచినన్నేలుమీ కరుణతోను

మాపాల గలవని మహిమీద నెల్లపుడు కొనియాడుచుందును కోర్కెదీర

శ్రీశ్రీ జయ మంగళం నిత్య శుభమంగళం శ్రీశ్రీ

Updated Date - Sep 07 , 2024 | 10:41 AM

Advertising
Advertising