Today Horoscope : ఈ రాశి వారు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
ABN, Publish Date - Dec 28 , 2024 | 01:23 AM
నేడు (28-12-2024-శయివారం) వ్యాపార విషయాల్లో అంచనాలు ఫలిస్తాయి. రక్షణ రంగాల వారికి వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది.
నేడు (28-12-2024-శయివారం) వ్యాపార విషయాల్లో అంచనాలు ఫలిస్తాయి. రక్షణ రంగాల వారికి వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
వ్యాపార విషయాల్లో అంచనాలు ఫలిస్తాయి. ప్రింటింగ్, టెలివిజన్, న్యాయం, బోధన, కన్సల్టెన్సీ, రవాణా, రక్షణ రంగాల వారికి వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. చర్చలు, ప్రయాణాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. బృందకార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. బంధుమిత్రులను పరామర్శిస్తారు. విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. పన్నులు, బీమా వ్యవహారాలపై దృష్టి పెడతారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడుల విషయాలకు అనుకూలమైన రోజు సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్త పరిచయాల వల్ల లబ్ధి పొందుతారు. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ పారాయణ శుభప్రదం.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
నూతన ప్రాజెక్టుల ప్రారంభానికి అనుకూలం. కొత్త పరిచయాలు ఉల్లాసం కలిగిస్తాయి. వ్యాపార రంగంలోని వారు లక్ష్యాలు సాధిస్తారు. వాణిజ్యం, వ్యవసాయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.
సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రకటనలు, విద్యాసంస్థలు, ఫైనాన్స్ కంపెనీల వారికి అనుకూల సమయం. కొత్త పరిచయాలు లాభిస్తాయి. సృజనాత్మక రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. సన్నిహితుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
కుటుంబ సభ్యుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. గృహనిర్మాణ సామగ్రి, ఫర్నీచర్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రియతములను కలుసుకుంటారు. చిన్నారులకు వసతి లభిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
మార్కెటింగ్, రవాణా, బోదన, స్టేషనరీ, ఏజెన్సీ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. చర్చలు, ప్రయాణాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. విద్యార్థులు పట్టుదలతో శ్రమించి లక్ష్యాలు సాధిస్తారు. ఇంటి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆంజనేయ స్వామిని ఆరాధించండి.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
బంధుమిత్రుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. పెట్టుబడులు, పొదుపు పథకాలపై చర్చలకు అనుకూలం. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. విలువైన పత్రాలు అందుకుంటారు. బిల్లులు మంజూరవుతాయి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పెట్టుబడుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. షాపింగ్ ఆనందం కలిగిస్తుంది. వ్యక్తిగత సౌకర్యాలు సమకూర్చుకుంటారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
రాజకీయాలు, సినిమాలు, టెక్స్‌టైల్స్, కళల రంగాల వారికి ఆర్థికంగా లాభిస్తుంది. ఎగుమతులు, కన్సల్టెంట్ రంగాల వారికి ప్రోత్సాహకరగా ఉంటుంది. పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. దూరప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడులు లాభిస్తాయి. వ్యాపారులు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ పారాయణ శుభప్రదం.
మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
వ్యాపార రంగంలోని వారికి ప్రోత్సాహకరమైన రోజు ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. సమావేశాల్లో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ప్రదర్శనలు, ఊరేగింపుల్లో పాల్గొంటారు. శ్రీ విష్ణు అష్టోత్తర శతనామపారాయణ శుభప్రదం.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ
Updated Date - Dec 28 , 2024 | 01:23 AM