Today Horoscope: ఈ రాశి శారు విద్యారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది
ABN, Publish Date - Dec 19 , 2024 | 06:00 AM
రాశిఫలాలు 19-12-2024 - గురువారం మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
రాశిఫలాలు
19-12-2024 - గురువారం
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
చిన్నారుల విద్యా విషయాల్లో శుభపరిణామాలు సంభవం. టెలివిజన్, రచనలు, కళలు, విద్యారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో అంచనాలు ఫలించకపోవడంతో నిరాశకు గురవుతారు. దత్త కవచపారాయణ శుభప్రదం.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
ఇల్లు, స్థల సేకరణకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. ఆర్థిక విషయాలను మీ వైఖరిని సమీక్షించుకుంటారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు ఆర్థిక లావాదేవీల్లో నిదానం పాటించాలి. కుటుంబ సభ్యుల ఆ రోగ్యం విషయంలో శ్రద్ధ చూపించాలి.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల లాభిస్తాయి. శుభవార్త అందుకుంటారు. బందుమిత్రులతో చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. కమ్యూనికేషన్లు, మార్కెటింగ్ రంగాల వారికి శ్రమాధిక్యం తప్పకపోవచ్చు. సన్నిహితులతో వాగ్వివాదాలకు దూరంగా ఉండండి.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
వ్యవసాయం, పరిశ్రమలు, వైద్య రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సకాలంలో డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో అదనపు ఆదాయం లభిస్తుంది. వైద్య సేవలకు ఖర్చులు అధికం. ఆర్థిక విషయాల్లో సన్నిహితులు మొహమాటపెట్టే అవకాశం ఉంది.
సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడులు లాభిస్తాయి. విద్యార్థులకు శుభప్రదం. ఆడ్వర్టయిజ్‌మెంట్స్, కన్సల్టెన్సీ, చిట్‌ఫండ్, టెలివిజన్, కళలు, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. చిన్నారులు, ప్రియతముల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. దత్త కవచ పారాయణ శుభప్రదం.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
గృహారంభ ప్రవేశాలకు సన్నాహాలు చేసుకుంటారు. ఇల్లు, స్థలసేకర ప్రయత్నాలు ఫలిస్తాయి. దూరంలో ఉన్న కుటుంబ సభ్యులు ఇల్లు చేరతారు. విద్యా సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాలు కొంత మనస్తాపం కలిగిస్తాయి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ శుభప్రదం.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక అంశాలకు సంబంధించిన ప్రయాణాలు, చర్చలు లాభిస్తాయి. పెట్టుబడులకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. అన్నదమ్ముల విషయాల్లో మంచి పరిణామాలు చోటుచేసుకుంటాయి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో నిదానం అవసరం. సాయినాధుని ఆరాధన శుభప్రదం.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంక్రిమెంట్లు, బోనస్‌లు అందుకుంటారు. ఆర్థిక విషయాల్లో పెద్దల తోడ్పాటు లభిస్తుంది. ఉన్నత పదవులు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ శుభప్రదం.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ప్రచురణలు, రవాణా, న్యాయ, బోధన రంగాల వారు కొత్త పనులు ప్రారంభించి విజయం సాధిస్తారు. ప్రణాళిక లోపించడం వల్ల లక్ష్య సాధనలో ఇబ్బందులు ఎదురవుతాయి. శ్రీ దత్త కవచ పారాయణ శుభప్రదం.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
విదేశీ విద్యకు అవసర మైన నిధులు సర్దుబాటు అవుతాయి. గతంలో చేసిన శ్రమకు ఫలితం లభిస్తుంది. వైద్యం, బీమా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఆర్థిక విషయాల కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. గాయత్రీ మాత ఆరాధన శుభప్రదం.
కుంభం (జనవరి 21 నుంచి ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. పందాలు పోటీల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది. సాయినాధుని ఆరాధన శుభప్రదం.
మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. పెద్దల ఆరోగ్యం పట్ల శ్ర ద్ధ చూపించాలి. ఉద్యోగ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురయ్యే అ వకాశం ఉంది. గోమాత సేవ శుభ ఫలితాలనిస్తుంది.
- శ్రీ బిజుమళ్ల బిందుమాధవ శర్మ సిద్ధాంతి
Updated Date - Dec 19 , 2024 | 08:45 AM