Today Horoscope : ఈ రాశి వారికి వాహనం కొనుగోలుకు అనుకూలమైన రోజు.
ABN, Publish Date - Dec 25 , 2024 | 02:20 AM
నేడు (25-12-2024-బుధవారం) శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు జరుగుతాయి.
నేడు (25-12-2024-బధవారం) శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు జరుగుతాయి.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు జరుగుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. కుటుంబ విషయాల్లో పెద్దల సహకారంతో సమస్యలను పరిష్కరించుకుంటారు. ప్రేమానుబంధాలు బలపడతాయి.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. వైద్యం, ఆహారపదార్ధాలు, సేవల రంగాల వారికి అనుకూలమైన రోజు. ఆ హార నియమాలు పాటించడం ద్వారా ఆరోగ్యం మెరుగుపరచుకునే ప్రయత్నాలు చేస్తారు.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
టెలివిజన్, ఆడిటింగ్, విద్యా రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్య, వేడుకలకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. పెట్టుబడులు లాభిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
గృహారంభ, ప్రవేశాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. వేడుకలు ఆనందం కలిగిస్తాయి. భాగస్వామి వైఖరిలో మార్పు గమనిస్తారు. ఇంటికి అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. తల్లిందండ్రుల విషయాల్లో మంచి పరిణామాలు జరుగుతాయి.
సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. మార్కెటింగ్, రవాణా, బోధన, స్టేషనరీ రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. వాహనం కొనుగోలుకు అనుకూలమైన రోజు. తోబుట్టువుల విషయంలో శుభపరిణామాలు సంభవం.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
మీలోని సృజనాత్మక ప్రతిభకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఫైనాన్స్, చిట్‌ఫండ్‌లు, క్రీడలు, ఆడి టింగ్, టెలివిజన్ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. విద్యకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాల వారు కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ విషయాల్లో మీ ఆలోచనలో మార్పు వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఒక సమాచారం ఆనందం కలిగిస్తుంది. ఎగుమతులు, ఫొటోగ్రఫీ, మైనింగ్, రంగాల వారు ప్రోత్సాహకరమైన సమాచారం అందుకుంటారు. కాంట్రాక్టులు, ఒప్పందాలు లాభిస్తాయి.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త పంథా అనుసరించి విజయం సాదిస్తారు. కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి అనుకూలమైన రోజు. ప్రముఖులను కలుసుకుంటారు. పదిమందిలో మంచిపేరు సంపాదిస్తారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు అనుకూలమైన రోజు. న్యాయ, బోధన, రవాణా, కళలు, ప్రచురణల రంగాల వారు గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. ప్రదర్శనల్లో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు.
మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మరమ్మతులకు వెచ్చిస్తారు. వైద్య సేవలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. శ్రమకు తగిన ప్రతిఫలం అందుకుంటారు. మూచ్యువల్ ఫండ్ పెట్టుబడులు లాభిస్తాయి.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ
Updated Date - Dec 25 , 2024 | 02:20 AM