ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Raksha Bandhan: భద్ర కాలం అంటే ఏమిటి? రాఖీ పౌర్ణమి రోజు రాఖీ ఏ సమయంలో కట్టాలి?

ABN, Publish Date - Aug 17 , 2024 | 09:49 AM

శ్రావణ పూర్ణిమ రోజే రాఖీ పూర్ణిమ జరుపుకుంటారు. ఈ రోజు అక్కా చెల్లెళ్లు తమ సోదరులకు రక్షగా, వారు ఎప్పుడూ సంతోషంగా, క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ రాఖీని కడతారు. అయితే రాఖీ ఎప్పుడు కట్టకూడదు.. ఎప్పుడు కట్టాలి?

Raksha Bandhan

శ్రావణ మాసం వ్రతాలు, పూజలు, పెళ్ళిళ్ళకే కాదు.. అన్నా చెల్లెళ్లకు, అక్కా తమ్ములకు కూడా చాలా ప్రత్యేకమైన మాసం. శ్రావణ పూర్ణిమ రోజే రాఖీ పూర్ణిమ జరుపుకుంటారు. ఈ రోజు అక్కా చెల్లెళ్లు తమ సోదరులకు రక్షగా, వారు ఎప్పుడూ సంతోషంగా, క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ రాఖీని కడతారు. అయితే రాఖీ కట్టడానికి ఒక నిర్దేశిత సమయం ఉంది. రాఖీ పౌర్ణమి రోజు వచ్చే భధ్రకాలాన్ని ఆ రోజు పరిగణలోకి తీసుకుంటారు. భద్రుని నీడ ఉన్న సమయంలో రాఖీ కట్టకూడదని అంటారు. అసలు రాఖీ పౌర్ణమి రోజు రాఖీ ఏ సమయంలో కట్టాలి? తెలుసుకుంటే..

ఒంట్లో నీరసంగా అనిపిస్తుందా? ఈ 5 ఆహారాలు తినండి చాలు.. శరీరంలో శక్తి నిండుకుంటుంది..!



రాఖీ పౌర్ణమి..

రాఖీ పౌర్ణమి అన్నా చెల్లెళ్లకు, అక్కా తమ్ముల ప్రేమకు ప్రతీతిగా నిలుస్తోంది. దీని వెనుక పురాణ కథనాలు కూడా ఉన్నాయి. అక్కా చెల్లెళ్లు తమ సోదరులకు రాఖీ కట్టి వారు క్షేమంగా ఉండాలని కోరుకుంటే.. సోదరులు తమ అక్కాచెల్లెళ్ళకు జీవితాంతం ఎలాంటి పరిస్థితులలో అయినా తోడుగా ఉంటామని, రక్షణ కల్పిస్తామని వాగ్ధానం చేస్తారు. ఈ ఏడాది రాఖీ పండుగ ఆగస్టు 19 వ తేదీ సోమవారం వచ్చింది. ఆ రోజు తెల్లవారుజామున 3.04 గంటల నుండి రాత్రి 11.55 వరకు పౌర్ణమి ఉంటుంది. అయితే ఇందులో భద్రకాలం కూడా ఉంటుంది. ఈ సమయంలో రాఖీ కట్టకూడదు.

ఖాళీ కడుపుతో నానబెట్టిన జీడిపప్పు తింటే ఏం జరుగుతుందంటే..!


భద్రకాలం..

రాఖీ పౌర్ణమి రోజు ఉదయం 9.51 కి భద్రకాలం ప్రారంభమవుతుంది. ఆ తరువాత మధ్యాహ్నం 1.30 కి ఈ భద్రకాలం ముగుస్తుంది. ఈ సమయంలో రాఖీ కట్టకూడదు. అసలు ఈ భద్ర ఎవరు? దీని గురించి ప్రచారంలో ఉన్న విభిన్న కథనాలు తెలుసుకుంటే...

భద్ర లంకాధిపతి రావణాసురుడికి సోదరి అని పురాణ కథనాలు చెబుతున్నాయి. రావణాసురుడి చెల్లెలు భద్ర పౌర్ణమి అనుకుని ఇంకా పౌర్ణమి తిథి రాకముందే రావణాసురుడికి రక్ష కట్టిందట. ఈ కారణంగానే రావణాసురుడికి రాముడి చేతిలో మరణం సంభవించింది అని పురాణ కథనాల సారాంశం. అందుకే అన్నదమ్ములకు భద్రకాలంలో రాఖీ కడితే కీడు జరుగుతుందని అంటారు.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో మునగ ఆకుల నీరు తాగితే జరిగేది ఇదే..!


మరొక కథనం ప్రకారం సూర్యుడి కుమార్తె పేరు భద్ర. ఈమె శనిదేవుడికి సోదరి. శనిదేవుడి లాగే ఈమె కూడా కఠినంగా ఉంటుందట. ఆమె ఉనికిలో ఉన్న సమయంలో సమస్త ప్రపంచాన్ని తన స్వరూపంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుందట. శుభకార్యాలు, పనులు అడ్డుకోవడం, కీడు చేయడం, పనులలో అవాంతరాలు సృష్టించడం వంటివి చేస్తుందట. ఇలాంటి సమయంలో సోదరులకు రాఖీ కడితే అది సోదరులకు కీడుగా మారే అవకాశం ఉందని అంటారు. అందుకే భద్ర కాలంలో కేవలం రాఖీ కట్టడమే కాదు.. వేరే ఇతర పనులు, శుభకార్యాలు కూడా తలపెట్టకూడదని అంటారు.

రాఖీ కట్టడానికి సమయం..

భద్రకాలం ముగిసిన తరువాత రాఖీ కట్టడం మంచిది. రాఖీ పౌర్ణమి రోజు మధ్యాహ్నం 1.30 కి భద్రకాలం ముగుస్తుంది. ఆ తరువాత అంటే.. ఆగస్టు 19 వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటల తరువాత రాఖీ కట్టవచ్చు. రాత్రి 7 గంటల వరకు రాఖీ కట్టెందుకు మంచి సమయం ఉంది.

ఆడవారిలో ఈ 8 లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి..!

టీతో రస్క్ తినే అలవాటు ఉందా? ఈ నిజాలు తెలిస్తే..!

మరిన్ని భక్తి వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 17 , 2024 | 09:49 AM

Advertising
Advertising
<