ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Char Dham Yatra: భక్తులకు గుడ్ న్యూస్.. చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ పూర్తి వివరాలు ఇవే..

ABN, Publish Date - Apr 15 , 2024 | 09:31 PM

సంస్కృతి సంప్రదాయాలకు భారతదేశం పెట్టింది పేరు. అడుగడుగునా ఆధ్యాత్మిక ఉట్టిపడే ఆలయాలు, రాజుల కాలం నాటి రాజస కట్టడాలు, శత్రు దుర్భేధ్యమైన కోటలు, ప్రశాంత సముద్ర తీరాలు.. ఇలా చెప్పుకుంటూపోతే లెక్కకు మిక్కిలి చాలా ఉన్నాయి.

సంస్కృతి సంప్రదాయాలకు భారతదేశం పెట్టింది పేరు. అడుగడుగునా ఆధ్యాత్మిక ఉట్టిపడే ఆలయాలు, రాజుల కాలం నాటి రాజస కట్టడాలు, శత్రు దుర్భేధ్యమైన కోటలు, ప్రశాంత సముద్ర తీరాలు.. ఇలా చెప్పుకుంటూపోతే లెక్కకు మిక్కిలి చాలా ఉన్నాయి. తూర్పున భువనేశ్వర్, దక్షిణాన రామేశ్వరం, పశ్చిమాన ద్వారక, ఉత్తరాన కేదార్ నాథ్ ఈ నాలుగు ప్రాంతాలు హిందువులకు పరమ పవిత్ర ధామాలు. అందుకే చార్ ధామ్ యాత్ర పేరుతో ( Devotional ) యాత్రికులు ఆధ్యాత్మిక అన్వేషణలో గడిపేస్తుంటారు. నాలుగు వైపులా ఉన్న ఈ మందిరాలను దర్శించుకోలేని వారు ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రిలను ఛోటా చార్ ధామ్ పేరుతో ఆధ్యాత్మిక ప్రదక్షణ చేస్తుంటారు. ఈ క్రమంలో భక్తులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చార్ ధామ్ యాత్ర కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించినట్లు వెల్లడించింది.


Health: అధికంగా వ్యాయామం చేయడమూ ముప్పే.. షాకింగ్ విషయాలు మీకోసం..

నాలుగు పుణ్యక్షేత్రాలను సందర్శించే భక్తులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం పోర్టల్ ప్రారంభమైంది. అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే కాకుండా మొబైల్ యాప్, వాట్సాప్ నంబర్ లేదా టోల్ ఫ్రీ నంబర్ ద్వారా భక్తులు పేరు నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ సమయంలో పేరు, మొబైల్ నంబర్, నివాస చిరునామాను అందించాలి. గుర్తింపునకు సంబంధించిన కార్డును స్కాన్ చేసిన కాపీని అప్‌లోడ్ చేయాలి. మే10న చార్ ధామ్ యాత్ర లాంఛనంగా ప్రారంభమవుతుంది. బద్రీనాథ్ తలుపులు మే 12న తెరుచుకుంటాయి.


Congress: ఎన్నికల బాండ్లలో పట్టుబడినందుకే ఇంటర్వ్యూలు.. ప్రధాని పై రాహుల్ ఘాటు వ్యాఖ్యలు..

వెబ్ సైట్ లో భక్తులు పేరు నమోదు చేసుకునేందుకు పర్యాటకశాఖ అధికారిక వెబ్‌సైట్ registrationandtouristcare.uk.gov.in ని సందర్శించండి. 'లాగ్ ఇన్' బటన్‌పై క్లిక్ చేయండి. వివరాలు పూరించండి. మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయండి. ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఫొటో ఐడీ రుజువును స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయండి. రిజిస్ట్రేషన్ తర్వాత ఒక నిర్ధారణ సందేశం వస్తుంది. చార్ ధామ్ యాత్ర కోసం రిజిస్ట్రేషన్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేయండి. దీనిని ప్రయాణ సమయంలో తీసుకెళ్లాలి. అవసరమైన చోట అధికారులకు చూపించాలి.

మరిన్ని ఆధ్యాత్మికం వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 15 , 2024 | 09:31 PM

Advertising
Advertising