ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vastu: నెమలి ఈకలు ఇంట్లో ఈ ప్లేస్ లో ఉంచండి.. అదృష్టం, ఐశ్వర్యం మీ వెంటే..!

ABN, Publish Date - Sep 13 , 2024 | 03:15 PM

నెమలి ఈకలను ఇంట్లో కొన్ని నిర్ణీత ప్రాంతాలలో ఉంచితే అదృష్టం, ఐశ్వర్యం చేకూరతాయి.

Peacock Feather

నెమలి ఈకలు చాలా ఇళ్లలో చూస్తుంటాం. నెమలి ఈకల వెనుక చాలా వాస్తు కారణాలు, నమ్మకాలు ఉన్నాయి. చైనీయులు నమ్మే ఫెంగ్ షుయ్ సిద్దాంతం ప్రకారం నెమలి ఈకలను ఇంట్లో కొన్ని నిర్ణీత ప్రాంతాలలో ఉంచితే అదృష్టం, ఐశ్వర్యం చేకూరతాయి. నెమలి ఈకలను ఏ ప్రాంతంలో ఉంచితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుంటే..

లివింగ్ రూమ్..

లివింగ్ రూమ్ లో నెమలి ఈకలు ఉంచితే సామరస్య వాతావరణం నెలకుంటుంది. ఇది సంతోషాన్ని ఆకర్షిస్తుందట. ఇంటిలో సానుకూలతను కాపాడుతుందట.

Parenting: తల్లిదండ్రులు రోజూ ఈ పనులు చేస్తుంటే చాలు.. జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉంటుంది..!


బెడ్ రూమ్..

పడక గదిలో నెమలి ఈకలను ఉంచడం వల్ల భార్యాభర్తల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమను, ఆనందాన్ని పెంపొందిస్తుంది.

గార్డెన్ లేదా బాల్కనీ..

పెరట్లో లేదా బాల్కనీ లో నెమలి ఈకలను ఉంచితే సహజ సౌందర్యం ఆ ఇంటి సొంతం. అంతేకాదు.. ఇది ఇంటి ఆర్థిక, కుటుంబ సభ్యుల ఎదుగుదల, శ్రేయస్సును మెరుగుపరుస్తుంది.

డబ్బు పెట్టే..

డబ్బులను దాచే పెట్టే లేదా లాకర్ వంటి వాటిలో నెమలి ఈకలను ఉంచడం వల్ల ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుంది. నెమలి ఈకలను ఉంచడం వల్ల డబ్బుకు రక్షణ, ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది.

Health Tips: గోరు వెచ్చని నీళ్లలో నెయ్యి కలిపి తాగితే కలిగే లాభాలు తెలుసా?

.


స్టడీ లేదా వర్క్ డెస్క్..

చదువుకునే బల్ల లేదా పనిచేసే వర్కింగ్ డెస్క్ వద్ద నెమలి ఈకలను ఉంచితే విద్యాపరమైన, వృత్తి పరమైన ప్రయత్నాలలో విజయాన్ని తెచ్చిపెడుతుంది. సంతోషంగా ఉండటానికి, ప్రతికూల శక్తులను దూరం చేయడంలో ఇది ప్రభావంగా ఉంటుంది.

ఇంటి ప్రవేశ ద్వారం..

ఇంటి ప్రవేశ ద్వారం వద్ద నెమలి ఈకను ఉంచితే ఇది ఇంట్లో సానుకూల శక్తిని, పాజిటివ్ వైబ్ ను ఆకర్షిస్తుంది. ఇంటికి అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది.

పర్సులో..

పర్సులో నెమలి ఈకను ఉంచితే జీవితంలో సానుకూలత ఉంటుంది. డబ్బు, సంపదను ఆకర్షించడంలో సహాయపడుతుంది.

Peanuts: స్నాక్స్ గా వేరుశనగలు తింటే ఏం జరుగుతుంది? మీకు తెలియని నిజాలివి..!


ఆగ్నేయ మూల..

వాస్తు ప్రకారం ఇల్లు లేదా వ్యాపార స్థలంలో ఆగ్నేయ మూలలో నెమలి ఈకలు ఉంచితే ఐశ్వర్యం చేకూరుతుంది.

పూజ గదిలో..

పూజ గదిలో నెమలి ఈకలను ఉంచితే ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది.

కిటికి..

కిటికిల దగ్గర నెమలి ఈకలను ఉంచితే వాటి మీదుగా ప్రసారం అయ్యే కాంతి ఇంట్లో పాజిటివ్ వైబ్ ను ప్రవహింపజేస్తుంది. చెడు శక్తులను దూరంగా ఉంచుతుంది.

ఇవి కూడా చదవండి..

డ్రాగన్ ఫ్రూట్ తింటే ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. ఈ నష్టాలు కూడా ఉంటాయి..!

మందంగా, ఒత్తుగా జుట్టును పెంచే సీక్రెట్ ఆయిల్.. దీన్నెలా చేయాలంటే..!

తేనెలో నానబెట్టిన వెల్లుల్లి తింటే జరిగేది ఇదే..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Sep 13 , 2024 | 03:24 PM

Advertising
Advertising