ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vinayaka Chavithi 2024: వినాయక చవితి.. విగ్రహ ప్రతిష్టాపనకు శుభ సమయం ఎప్పుడంటే..

ABN, Publish Date - Sep 02 , 2024 | 07:14 PM

మానవులకే కాదు.. సర్వ దేవతల విఘ్నాలు తొలగించే వాడు విఘ్నేశ్వరుడు. చిన్న పూజ మొదలు అతి పెద్ద యాగం నిర్వహించాలన్నా తొలుత పూజలందుకే ఒకే ఒక్క దేవుడు వినాయకుడు. ఆయన జన్మదినాన్ని వినాయక చవితిగా జరుపుకుంటారు.

మానవులకే కాదు.. సర్వ దేవతల విఘ్నాలు తొలగించే వాడు విఘ్నేశ్వరుడు. చిన్న పూజ మొదలు అతి పెద్ద యాగం నిర్వహించాలన్నా తొలుత పూజలందుకే ఒకే ఒక్క దేవుడు వినాయకుడు. ఆయన జన్మదినాన్ని వినాయక చవితిగా జరుపుకుంటారు. అలాంటి భాద్రపద శుద్ద చవితి రోజు.. వినాయకుడి విగ్రహాన్ని భక్తులు తన ఇంట ప్రతిష్టించి... 21 రకాల పత్రితో పూజిస్తారు.


ఏ సమయంలో పూజించాలంటే..

ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీ.. అంటే శనివారం వినాయక చవితిని భక్తులు భక్తి శ్రద్దలతో జరుపుకోనున్నారు. అలాంటి వేళ వినాయకుడిని ఈ శుభ సమయంలో పూజించాలని శాస్త్ర పండితులు స్పష్టం చేస్తున్నారు. 2024, సెప్టెంబర్ 6వ తేదీ మధ్యాహ్నం 3:01 గంటలకు చతుర్థి తిధి ప్రారంభమవుతుంది. మర్నాడు అంటే సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 5:37 గంటలకు ముగియనుంది.


వినాయకుడు మధ్యాహ్నం జన్మించాడనే ఓ నమ్మకం భక్తుల్లో చాలా బలంగా నెలకొంది. దీంతో వినాయకుడిని పూజించడానికి అత్యంత శుభమైన కాలం మధ్యాహ్నం అని వారు పేర్కొంటున్నారు. అలాగే పూజ కోసం వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకు రావడానికి అనువైన సమయం.. సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నమని వారు చెబుతున్నారు.


అందుకు శుభ యోగం ఉదయం 11:03 గంటల నుంచి మధ్యాహ్నం 1:34 వరకు ఉందన్నారు. అంటే 2024లో గణేశుడి విగ్రహ ప్రతిష్ఠాపనకు రెండున్నర గంటలు (150 నిమిషాలు) శుభ ముహూర్తమని ఈ సందర్భంగా శాస్త్ర పండితులు వివరిస్తున్నారు.


వినాయక చవితి రోజు అనేక శుభయోగాలు..

ఇక ఈ ఏడాది వినాయక చవితి సందర్బంగా అనేక శుభ యోగాలు ఏర్పడనున్నాయి వారు చెబుతున్నారు. అందులో ఒకటి సర్వార్థ సిద్ది యోగం ఉందన్నారు. ఆ రోజు అన్ని గ్రహాల స్థానం పరిపూర్ణంగా ఉంటుందని వారు తెలిపారు. ఈ యోగాల్లో వినాయకుడి భక్తి శ్రద్దలతో పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలుంటాయని వివరిస్తున్నారు. భద్రపద శుద్ద చవితి రోజు.. సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 12.34 గంటలకు ప్రారంభమై.. సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 6.30 గంటల వరకు ఈ యోగం కొనసాగనుందని చెప్పారు.


అదే రోజు.. రవి యోగం ఏర్పడనుంది. సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం 9.35 గంటల నుంచి ఆ మరునాడు అంటే సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 12.34 గంటల వరకు ఈ యోగం కొనసాగనుందని పేర్కొన్నారు. అలాగే అదే రోజు బ్రహ్మ యోగం సైతం ఏర్పడుతుందని వారు వివరిస్తున్నారు. ఇది కూడా అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారని శాస్త్ర పండితులు సోదాహరణగా వివరిస్తున్నారు.

Updated Date - Sep 02 , 2024 | 07:14 PM

Advertising
Advertising