Kartik Pradosh Vrat: ఈ రోజున వ్రతమాచరిస్తే.. సకల కష్టాలు తొలగిపోతాయ్
ABN, Publish Date - Oct 26 , 2024 | 04:30 PM
ప్రదోష వ్రతాన్ని ప్రతి మాసం కృష్ణ త్రయోదశి, శుక్ల పక్షంలో ఆచరిస్తారు. శివుడిని పూజించే ఆ రోజున.. ఉపవాసం దీక్ష చేపడితే పరమ శివుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని భక్తుల నమ్మకం.
ఇంటర్నెట్ డెస్క్: ప్రదోష వ్రతాన్ని ప్రతి మాసం కృష్ణ త్రయోదశి, శుక్ల పక్షంలో ఆచరిస్తారు. శివుడిని పూజించే ఆ రోజున.. ఉపవాసం దీక్ష చేపడితే పరమ శివుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని భక్తుల నమ్మకం. కార్తీక మాసంలో ప్రదోష ఉపవాసం ప్రత్యేకమైనది. దీనికి కారణం కృష్ణ పక్షంలోని త్రయోదశి తిథి నాడు మొదటి కార్తీక ప్రదోష వ్రతం ఆచరించడం. ఈ రోజునే ధన్తేరస్ పండుగ కూడా జరుపుకుంటారు. ఈసారి మొదటి కార్తీక ప్రదోష వ్రతం ఎప్పుడో తెలుసుకుందాం...
వ్రతం వివరాలు..
హిందూ క్యాలెండర్ ప్రకారం.. అక్టోబర్ 29 ఉదయం 10.31 గంటలకు కృష్ణ పక్ష త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే అక్టోబర్ 30న మధ్యాహ్నం 1:15 గంటలకు ముగుస్తుంది. ప్రదోష వ్రతాన్ని ప్రదోష కాలంలో పూజిస్తారు.
పూజకు అనుకూలమైన సమయం..
ప్రదోష కాలంలో వ్రతాన్ని ఆరాధించే సంప్రదాయం ఉంది. ఈ కారణంగా అక్టోబర్ 29 సాయంత్రం 5:38 నుంచి రాత్రి 8:13 వరకు పూజలు చేయవచ్చు.
వ్రతం ప్రాముఖ్యత..
కార్తీక మాసంలోని ప్రదోష వ్రతం చాలా ప్రత్యేకమైనది. మత విశ్వాసాల ప్రకారం.. ఆ రోజున శివుడిని ఆరాధించడం ద్వారా కోరిన కోరికలు తప్పకుండా నెరవేరతాయని భక్తుల నమ్మకం. బాధలు, దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
ప్రదోష వ్రతం రోజు ఈ మంత్రాన్ని పఠించండి
1. ఓం నమః శివాయ
2. ఓం గౌరీశంకరార్ధనాత్రి నమః
3. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం నవహంతు
4. ఓం నమః శివాయ గురుదేవాయ నమః
5. ఓం శివలింగాయ నమః
అనంతరం శివునికి హారతి ఇస్తు ఇది చదవండి..
జై శివ ఓంకార, స్వామి ఓం జై శివ ఓంకార.
ఏకనన్ చతురానన్ పఞ్చానన్ రాజే.
త్రిగుణ రూపనిరఖత త్రిభువన్ జన్ మోహే ॥ ఓం జై శివ్..
అక్షమాల బన్మల రుండమాల ధారీ।
చందన మృగమద్ సోహై భలే శశిధారీ ॥ ఓం జై శివ్..
శ్వేతాంబర్ పీతాంబర్ బాఘంబర్ అంగే.
సనకాదిక్ గరుణాదిక్ భూతదిక్ సంగే. ఓం జై శివ్..
జై శివ ఓంకార హర్ ఓం శివ ఓంకార
బ్రహ్మ విష్ణు సదాశివ సగం ధార. ఓం జై శివ ఓంకార…॥
ఇవి కూడాచదవండి..
TG Police: పోలీసు, పొలిటికల్ వర్గాల్లో సంచలనంగా మారిన అజ్ఞాత వ్యక్తి లేఖ..
Jaggareddy: అవును.. వాళ్లను తిట్టాను.. తప్పేంటి
Read Latest Telangana News And Telugu News
Updated Date - Oct 26 , 2024 | 04:30 PM